WorldWonders

చూడముచ్చటగా హుస్సేన్‌సాగర్

చూడముచ్చటగా హుస్సేన్‌సాగర్

నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో భాగ్యనగరం తడిసిముద్దైంది.

హైదరాబాద్ లో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షంతో హుస్సేన్‌ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

దీంతో హుస్సేన్ సాగర్ నిండుకుండను తలపిస్తోంది. అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు తూముల నుంచి వరద నీరు కిందకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు.

అటు లుంబినీ పార్కులోకి వరద నీరు చేరింది. నగరంలోని ప్రధాన రహదారులన్నీ వరద నీటిలో మునిగిపోయాయి.

నేడు హుస్సేన్ సాగర్ గేట్లు ఎత్తి వేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

దీంతో సాగర్ పరిసర ప్రాంతాల్లో నివసించే వారు ఇతర ప్రాంతాలకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు అప్రమత్తం చేశారు.

అశోక్ నగర్, హబ్సిగూడ, నల్లకుంట ఏరియా లోకి వరద నీరు వెళ్లే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కాలువ వెంట ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో హుస్సేన్ సాగర్‌కు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.