Politics

పవన్ అభిమానికి జగన్ ₹10లక్షల సాయం

పవన్ అభిమానికి జగన్ ₹10లక్షల సాయం

పవన్‌కల్యాణ్ అభిమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.10 లక్షలు మంజూరు చేశారు.

పవన్ కల్యాణ్ అభిమాని నాగేంద్ర రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని, అతనికి అత్యవసర చికిత్స చేయాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ట్వీట్ చేసింది.

పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే సీఎం జగన్ పవన్ అభిమానికి రూ.10లక్షలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు సీఎంవో స్పెషల్ ఆఫీసర్‌ డాక్టర్ హరికృష్ణ ఆస్పత్రికి ఎల్‌వోసీ అందజేశారు.

ప్రభుత్వ సాయంతో పవన్ అభిమాని నాగేంద్రకు స్టెమ్ సెల్ థెరపి జరిగింది.

అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సీఎంవో అధికారులు పేర్కొన్నారు.