* రాష్ట్రంలో ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరాధారమని ఏపీ హోం మంత్రి సుచరిత స్పష్టం చేశారు. ఈ విషయంపై మంత్రి మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. ఆయన అనుభవం ఇలాంటి చౌకబారు ఆరోపణలకి వినియోగించడం రాష్ట్రానికి దురదృష్టమని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వంపై బురద చల్లడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి అందిస్తున్న సమయంలో ప్రభుత్వ ఆదరణ పెరగకుండా ఇలాంటి కుట్రలు చేస్తున్నారని చెప్పారు.
* వినాయక చవితిని ఇంట్లోనే జరుపుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. పండగకు నాలుగు రోజులే ఉందనగా ఇప్పుడు చెప్పడమేంటి? అని ప్రశ్నించారు. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా గణేశ్, నవరాత్రి ఉత్సవాలను ఇంట్లోనే జరుపుకోవాలంటున్న ప్రభుత్వం మరి బక్రీద్‌కు ఎలా అనుమతి ఇచ్చారని రాజాసింగ్ నిలదీశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అనేక మంది ఇబ్బందులకు గురవుతారన్నారు.
* తెలంగాణ శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలపై ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులతో చర్చించారు. సెప్టెంబర్ 7 నుంచి సభ నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. 20 రోజులపాటు అసెంబ్లీ నిర్వహించడం వల్ల సమగ్ర చర్చలు జరిపే అవకాశముందని సీఎం అభిప్రాయపడ్డారు. కనీసం 15 రోజులు పనిదినాలైనా ఉండాలని మంత్రులు భావిస్తున్నారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు సభ్యులు సిద్ధం కావాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు.
* ప్రముఖ సంగీత విద్వాంసుడు పండిట్ జస్రాజ్ (90) కన్నుమూశారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆమె కుమార్తె దుర్గా జస్రాజ్ ఈ విషయాన్ని వెల్లడించారు. 1930 జనవరి 28న హరియాణాలోని హిస్సార్ ప్రాంతంలో జస్రాజ్ జన్మించారు. సుమారు 80 ఏళ్ల పాటు గాయకుడిగా, సంగీత గురువుగా శాస్త్రీయ సంగీతానికి విశేష సేవలందించారు. ఆయన సేవలకు గాను పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి.
* 2020 ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి వివో తప్పుకున్నాక స్పాన్సర్‌షిప్ కోసం పలు సంస్థలు రేసులో నిలిచాయి. పతంజలి ఆయుర్వేద, బైజూస్, డ్రీమ్ 11 ఫాంటసీ స్పోర్ట్స్ లాంటి సంస్థలు స్పాన్సర్‌షిప్ కోసం ముందుకు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం భారత దిగ్గజ సంస్థ టాటా సన్స్ సంస్థ రేసులో నిలిచింది. వేలంపాటలో అత్యధికంగా కోట్ చేసిన సంస్థకి, టోర్నమెంట్‌పై ఆ బ్రాండ్ చూపే ప్రభావాన్ని బట్టే ఆ సంస్థకు ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ దక్కనుంది. ఈ రకంగా చూస్తే స్పాన్సర్‌షిప్ రేసులో టాటా సన్స్ ముందుండనుంది.
* మైక్రోమ్యాక్స్.. ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఓ వెలుగు వెలిగిన దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ. ఓ దశలో దక్షిణకొరియా దిగ్గజం శాంసంగ్‌కు సైతం చెమటలు పట్టించిన ఆ కంపెనీ.. చైనా ఫోన్ల ప్రవేశంతో తన ప్రాభవాన్ని కోల్పోయింది. కంపెనీనే జనం మరిచిపోయే దశకు చేరింది. ఈ నేపథ్యంలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఆ కంపెనీ సిద్ధమైంది. త్వరలోనే కొన్ని ఫోన్లను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
* రాష్ట్రంలో ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరాధారమని ఏపీ హోం మంత్రి సుచరిత స్పష్టం చేశారు. ఈ విషయంపై మంత్రి మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. వైకాపా ప్రభుత్వంపై బురద చల్లడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి అందిస్తున్న సమయంలో ప్రభుత్వ ఆదరణ పెరగకుండా ఇలాంటి కుట్రలు చేస్తున్నారని చెప్పారు.
* భాగ్యనగరంలో మరోసారి భారీఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. హైదరాబాద్ నగర శివారులో సుమారు రూ.81 కోట్ల విలువ డ్రగ్స్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేటు బస్సులో హైదరాబాద్ నుంచి ముంబయికి తరలిస్తుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. రూ.28.52 కోట్ల విలువైన 142.6 కిలోల మెఫెడ్రన్, రూ.3.1 కోట్ల విలువైన 31 కిలోల ఎపిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓ ఫ్యాక్టరీలో మెఫెడ్రిన్ తయారీకి సిద్ధంగా ఉంచిన 250 కిలోల ముడిసరకునూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
* కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ అధికార భాజపాపై చేస్తోన్న విమర్శల పర్వంలో ఈసారి ఉత్తర్‌ప్రదేశ్ శాంతిభద్రతల అంశాన్ని చేర్చారు. గత వారం అజమ్‌గఢ్ జిల్లాలోని ఒక గ్రామ సర్పంచిని హత్య చేసిన ఘటనను రాహుల్ ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. ‘కుల ఆధారిత హింస, తీవ్ర స్థాయిలో అత్యాచారాలతో యూపీలో ఆటవిక రాజ్యం కొనసాగుతోంది. అజమ్‌గఢ్ జిల్లాలోని ఓ గ్రామ సర్పంచి సత్యమేవ్ జయతే అలియాస్ పప్పురామ్ దళితుడు అయిన కారణంగా హత్యకు గురయ్యారు’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో రాష్ట్రంలో కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో (9am-9am) రాష్ట్రవ్యాప్తంగా 6,780 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,609కి చేరింది. గత 24 గంటల్లో 44,578 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు మొత్తంగా 29.05లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 84,777 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
* కృష్ణానదిలో ప్రమాదం చోటుచేసుకుంది. మక్తల్ మండలం పస్పల వద్ద కృష్ణా నదిలో పుట్టి మునిగి నలుగురు గల్లంతయ్యారు. పస్పల నుంచి కురవపురంకు కొంతమంది పుట్టిలో వెళ్తుండగా వరద ప్రవాహంలో పుట్టి నీట మునిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మందిని మరో పుట్టిలో ప్రయాణిస్తున్నవారు కాపాడారు. కానీ చిన్నారితోపాటు మరో ముగ్గురు నదిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
* ఎమ్మెల్సీగా పెనుమత్స సూర్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం భర్తీకి వైకాపా తమ పార్టీ తరఫున మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత పెనుమత్స సాంబశివరావు తనయుడు సూర్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.