కలువ కళ్ల సుందరి కాజల్ పెళ్లి వార్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాజల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఈ భామ రహస్యంగా ఓ వ్యాపారవేత్తతో ఎంగేజ్ మెంట్ రింగ్ మార్చుకున్నట్టు వార్త ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాఫిక్ గా మారింది. గౌతమ్ అనే బిజినెస్ మెన్‌తో కాజల్ పెళ్లి ఫిక్స్ కాగా..కాజల్ కు బెల్లంకొండ శ్రీనివాస్ విషెస్ కూడా చెప్పాడని టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ జంట వివాహబంధంతో ఒక్కటవ్వనున్నారని ఇన్ సైడ్ టాక్. మరి ఈ పెళ్లి వార్తలపై కాజల్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. కాజల్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తాను 2020లో సెటిలవ్వాలనుకుంటున్నట్టు చెప్పింది. అంతేకాదు తనకు కాబోయే భర్త ముఖ్యంగా సంరక్షణ బాధ్యతలు చూసుకునే స్వభావం, భక్తిభావం కలిగి ఉన్న వ్యక్తి అయి ఉండాలని కాజల్ చెప్పుకొచ్చింది.పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటానని ఇప్పటికే చెప్పింది కాజల్ అగర్వాల్.
కాజల్ నిశ్చితార్థం అయిపోయింది
Related tags :