★ మీ సమర్ధ, శక్తివంతమైన నాయకత్వంలో దేశ భద్రత గణనీయంగా ఇనుమడించింది, మన సాయుధ దళాలు నూతన విశ్వాసాన్ని పొందాయి.
★ అంతర్గతంగా, ఉగ్రవాదులు మరియు ఉగ్రవాద శక్తుల నుండి వచ్చే ముప్పు తగ్గింది, దేశం వెలుపల సరిహద్దులు బలోపేతం చేయబడ్డాయి.
★ మీ నిశిత దృష్టితో కొత్త పొత్తులు ఏర్పడ్డాయి.
★ ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ నాయకులు మరియు ఇతరుల ఫోన్ల ట్యాపింగ్ రూపంలో వాటిల్లిన తీవ్రమైన ముప్పు గురించి మీ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము.
★ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైయస్ఆర్సీపి) పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నారు.
★ వైయస్ఆర్సీపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, రాష్ట్రంలోని ప్రజాస్వామ్య సంస్థలపై ఒక పద్దతి ప్రకారం దారుణమైన దాడి జరిగింది.
★ మొదట్లో గత ప్రభుత్వ పాలనలో వచ్చిన పెట్టుబడిదారులపై మరియు విధానాలపై దాడి చేయడం ద్వారా పాలనా ప్రక్రియ పూర్తిగా పట్టాలు తప్పింది.
★ ఆ తరువాత రాష్ట్ర ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సీ) తదితర సంస్థలపై దాడి జరిగింది.
★ దాంతోపాటుగా ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, మీడియా వ్యక్తులు మరియు సామాజిక కార్యకర్తలపై అధికార వైయస్ఆర్సిపి దాడులు చేసి బెదిరిస్తోంది.
★ ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, మీడియా వ్యక్తులు మరియు సామాజిక కార్యకర్తల ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేయడం అధికార పార్టీ దినచర్యగా మారింది.
★ ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1885 [సెక్షన్ 5 (2)] మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 [సెక్షన్ 69] ప్రకారం టెలిఫోన్ ట్యాపింగ్ జాతీయ భద్రతకు ముప్పు ఉన్న సందర్భంలో లేదా సార్వభౌమాధికారం, దేశ సమగ్రత ప్రయోజనాల కోసం, విదేశాలతో స్నేహ పూర్వక సంబంధాలకు ముప్పు వాటిల్లే సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ చేయడం కద్దు.
★ దైనందిక జీవితంలో వివిధ వర్గాల ప్రజల ఫోన్లను ట్యాప్ చేయడంలో చట్టబద్ధమైన ఎటువంటి విధానాన్ని వైయస్ఆర్సిపి నేతృత్వంలోని ప్రభుత్వం పాటించడం లేదనేది దీనినిబట్టే తెలుస్తోంది.
★ రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 19 మరియు ఆర్టికల్ 21లో హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులకు ఉల్లంఘించడమే ఇది.
★ గోప్యత హక్కును కాలరాస్తున్నట్లే అవుతుంది.
★ అంతేకాకుండా, భారతీయ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5 (2) , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 లోని సెక్షన్ 69 లను కూడా ఈ ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది, పైన పేర్కొన్నటువంటి ఏ విధమైన కారణాలు లేకుండానే రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు మరియు సామాజిక కార్యకర్తల ఫోన్లను వైయస్ఆర్సిపి నేతృత్వంలోని ప్రభుత్వం తన రాజకీయ లాభాల కోసం చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేస్తోంది.
★ అంతేకాకుండా ఇల్లీగల్ సాఫ్ట్ వేర్ ద్వారా, చట్టవిరుద్ధంగా ఈ ట్యాపింగ్ జరుగుతోందని మేము ఆందోళన చెందుతున్నాం.
★ దీర్ఘకాలంలో జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు తెచ్చే అవకాశం ఉన్నందున ఇది మరింత ప్రమాదకరమైనది.
★ ఇటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం దుండగుల చేతిలో ఉండడం వల్ల వ్యక్తుల గోప్యత హక్కును కాలరాయడమే కాకుండా, అత్యున్నత స్థానాల్లోని వ్యక్తులను తమ దారికి తెచ్చుకోడానికి బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులకు గురిచేయడానికి దారితీస్తుంది.
★ ఏ విధంగానైనా తమ అధికారాన్ని నిలుపుకోవాలనే తపనతో అధికార పార్టీ వైఎస్సార్సీపి దారుణంగా బెదిరిస్తోంది, ఈ ప్రభుత్వ తప్పుడు పనులకు వ్యతిరేకంగా గళం వినిపించే ఏ వ్యక్తి లేదా సంస్థపై దాడి చేస్తోంది.
★ ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు న్యాయవాదులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ఎవరినీ వదలడం లేదు.
★ తమ చర్యలకు న్యాయవ్యవస్థ నుండి అడ్డంకులు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతో, ప్రజాస్వామ్య వ్యవస్థ మూడో స్తంభమైన న్యాయవ్యవస్థను కూడా పాలక వైయస్ఆర్సిపి ప్రస్తుతం లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది.
★ ప్రైవేటు వ్యక్తులు కూడా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజి, పరికరాలు వినియోగించి ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
★ ఈవిధమైన ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ లకు అడ్డుకట్ట వేయకపోతే దేశ భద్రతకు, సార్వభౌమాధికారానికే పెనుముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది.
★ ప్రభుత్వాలు లేదా ప్రైవేటు వ్యక్తుల ఇటువంటి చట్టవిరుద్దమైన అక్రమ చర్యలను కట్టడి చేయకపోతే ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న వ్యవస్థల విధ్వంసానికి దారితీస్తుంది.
★ దీర్ఘకాలంలో ఇటువంటి దుశ్చర్యలు ప్రజాస్వామ్య విలువల పతనానికి, భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కల్గించడమే కాకుండా ఆటవిక రాజ్యం(జంగిల్ రాజ్) వైపు దారితీస్తాయి.
★ ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ మరియు ప్రైవేటు వ్యక్తులతో ఇలాంటి చట్టవిరుద్ద కార్యకలాపాల (ఫోన్ ట్యాపింగ్)కు మళ్లీ పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మిమ్ములను కోరుతున్నాం.
★ ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వంటి అక్రమాలు, చట్టవిరుద్ద చర్యలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ద్వారా విచారణకు ఆదేశించడం సముచిత చర్య.