Food

కోడి మాంసంతో కరోనా ఖతం

కోడి మాంసంతో కరోనా ఖతం

చికెన్‌, కోడిగుడ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. రాష్ట్రంలో రోజుకు 3 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. అందులో 1.5 కోట్ల గుడ్లు విక్రయమవుతున్నాయి. మిగిలినవి ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే కరోనా పరిస్థితుల కారణంగా 5 శాతం వినియోగం పెరుగడం విశేషం. ముఖ్యంగా కరోనా బారిన పడిన కుటుంబాల్లో ఒక్కొక్కరూ రోజుకు రెండు చొప్పున కోడిగుడ్లను తీసుకుంటున్నారు. కొందరు శాకాహారులు తమ పిల్లలకు గుడ్డు తినిపించడం అలవాటు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌కు చెందిన శర్మ తన పిల్లలకు రోజూ ఉడికించిన గుడ్డు తినిపిస్తున్నట్లు తెలిపారు. రోగ నిరోధక శక్తి పెంచుకోవడం కోసం వైద్యులు సూచించిన ఎలాంటి ఆహారమైనా ఒక మెడిసిన్‌గానే భావించాలని ఆయన చెబుతున్నారు. ఇక చికెన్‌ కొనుగోళ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చికెన్‌ సెంటర్ల ముందు క్యూలైన్‌లు దర్శనమిస్తున్నాయి. కేజీ చికెన్‌ రూ.180 ఉంటే.. నాటుకోడి రూ.450 పైనే ఉంది. ధరలు ఎంత ఉన్నా.. కొనుగోలు చేస్తుండటం విశేషం. ప్రొటీన్‌ను అధిక శాతం అందించే ఆయుధం గుడ్డు. ఉడికించింది తింటే బలం. ఎంతో మేలు చేసే గుడ్డు చౌకగా లభించడం మరో విశేషం. కొవిడ్‌తో చాలా మంది తమ ఆహార అలవాట్లను మార్చుకున్నారు. తమ ఫుడ్‌ డైట్‌లో ఎగ్‌, చికెన్‌ను భాగం చేసుకున్నారు. హిమాయత్‌నగర్‌కు చెందిన రాము ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు. నాన్‌వెజ్‌కు దూరంగా ఉండే ఆయన..చికిత్సలో భాగంగా చికెన్‌, ఎగ్‌ తిన్నారు. ఇప్పుడు ఇంట్లో కూడా తినడం అలవాటు చేసుకున్నామని చెప్పారు. పోషక విలువలు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే కొవిడ్‌ నుంచి సులభంగా కోలుకోవచ్చని కరోనా విజేతలు సైతం సూచిస్తున్నారు.