సురేఖా వాణి..తన నటనతో అందరినీ ఆకట్టుకోగల నటి. ఈ సీనియర్ నటి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందనే విషయం తెలిసిందే. తన కూతురుతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు పోస్ట్ చేయగా..నెట్టింట్లో వైరల్ కూడా అయ్యాయి. ఇన్ స్టాలో సురేఖా వాణి ఫాలోవర్ల సంఖ్య ఎక్కువే. అయితే సోషల్ మీడియాలో లింకప్ రూమర్స్ పై విసుగుచెందారట సురేఖా వాణి..అనవసరమైన పుకార్లను పట్టించుకోవడం కూడా మానేశానంటోంది. ఓ ఇంటర్య్వూలో సురేఖా వాణి మాట్లాడుతూ…పుకార్లు తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తాయని, ఆన్ లైన్ లో ఎవరైనా కథనాలు సృష్టించేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సున్నితంగా హెచ్చరించారు. సురేఖా వాణి కూతురు సుప్రిత త్వరలోనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటోంది.
పోరంబోకు పుకార్లు పుట్టించేవారికి హెచ్చరికలు
Related tags :