* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 44,578 సాంపిల్స్ ని అధికారులు పరీక్షలు నిర్వహించారు. వారిలో 6,780 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,96,609కి చేరింది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 2,09,100 మంది డిశ్చార్జి కాగా.. వివిధ కోవిడ్-19 ఆసుపత్రుల్లో ప్రస్తుతం 84,777 మంది చికిత్స పొందుతున్నారు. నేడు 82 మంది కరోనాతో చనిపోగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి 2,732 మంది మరణించారు.
* కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. భారత్‌లో 26 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. 50 వేలకు పైగా మరణించారు. మహమ్మారిని కట్టడి చేయగల వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రష్యా ఇప్పటికే వ్యాక్సిన్‌ను ప్రకటించడమే కాక ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మలేషియాలో వెలుగు చూసిన కొన్ని కరోనా కేసులు ప్రపంచ దేశాలకు మరో నూతన సవాలు విసురుతున్నాయి. తాజాగా మలేషియాలో కరోనా వైరస్ కొత్త జాతిని గుర్తించిన శాస్త్రవేత్తలు, ఇది ప్రస్తుతం ఉన్న వైరస్ కంటే 10 రెట్లు ప్రమాదకరమైనదిగా వెల్లడించారు.
* రమేష్ ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాద ఘటనపై ముందస్తు బెయిల్ కోసం డాక్టర్ రమేష్ బాబు కోర్టును అశ్రయించారు. రమేష్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సోమవారం జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. అనంతరం తదుపరి విచారణను జిల్లా కోర్టు ఈ నెల 21కు వాయిదా వేసింది. కాగా స్వర్ణ ప్యాలెస్‌లో రమేష్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కారణంగా 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోంది.
* కొవిడ్-19 నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు
గ్యాలరీల్లోనూ సభ్యులకు సీట్లు కేటాయింపు
డిజిటల్ తెరల ఏర్పాటు.. అందులోనే చర్చ
నాలుగు గంటలే సమావేశాల నిర్వహణ
15 మంది రిపోర్టర్లకే ప్రవేశానుమతి
పార్లమెంటు సిబ్బందీ పరిమితంగానే
సెప్టెంబర్ 23లోపు పార్లమెంటు భేటీ
* కోటవురట్ల మండలం కొడవటిపూడి గ్రామానికి చెందిన పెళ్లి కుమారుడికి ఆదివారం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో బంధు వర్గాల్లో కలవరం మొదలైంది. గ్రామానికి చెందిన 31 ఏళ్ల యువకుడు రంగారెడ్డి జిల్లా నుంచి 20 రోజుల కిందట వచ్చాడు. ఇతనికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ నెల 5న వీఎల్‌ఎం కిట్‌తో కోవిడ్ పరీక్ష చేసి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి నమూనా పంపించారు.