NRI-NRT

బ్రిటన్ జర్మనీ ఫ్రాన్స్‌లకు విమానాలు

బ్రిటన్ జర్మనీ ఫ్రాన్స్‌లకు విమానాలు

భారత్‌ నుంచి బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాలకు ప్రైవేట్‌ విమానయాన సంస్థ విస్తారా కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ దేశాలతో ద్వైపాక్షిక విమాన సర్దుబాటు కింద కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం విమాన కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నెల ప్రారంభంలో కొన్ని నిబంధనలతో అంతర్జాతీయ విమానాలను నడిపేందుకు బ్రిటన్‌తో భారత్‌ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇదే విధమైన ద్వైపాక్షిక ఒప్పందాలను జులైలో జర్మనీ, ఫ్రాన్స్‌లతో సైతం భారత్‌ కుదుర్చుకుంది. ఇక విస్తారా రెండో బీ787-9 విమానాన్ని శనివారం అందుకుంది. మొదటి బీ787-9 విమానం ఫిబ్రవరిలో వచ్చింది. విస్తారాకు లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో ఇప్పటికే శ్లాట్‌లు లభించాయని, వచ్చే కొన్ని రోజుల్లో వారానికి మూడు సార్లు చొప్పున దిల్లీ- లండన్‌ సేవలను ప్రకటించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల సమాచారం.