కొవిడ్ వచ్చి తగ్గింది. అయినా నీరసంగా ఉంది. ఆకలి లేదు.. అన్నం తినాలనిపించడంలేదు.. కోలుకునేది ఎలా అనే దిగులు పట్టుకుంటే మరింత నీరసం ఆవహిస్తుంది. కోవిడ్ వచ్చి కోలుకున్న వారికి ఆకలి తక్కువగా ఉంటుంది. ఆహారం రుచించకపోవడం వల్ల సరైన ఆహారం తీసుకోవడం కష్టంగా మారుతుంది. శరీరానికి సరైన మోతాదులో పోషకాలు అందకపోతే నీరసం వస్తుంది. శక్తినిచ్చే ఆహారపదార్థాలు, మాంసకృత్తులు, జీవవ్యవస్థల పనితీరును సక్రమంగా ఉంచే విటమిన్లు, ఖనిజాలు, అన్నింటినీ తగుపాళ్లలో తీసుకుంటేనే త్వరగా కోలుకోగలుగుతారు. ఉదయం అల్పాహారంలో “గుడ్లు”, పాలు, మొలకెత్తిన గింజలు, పండ్లు తీసుకోవాలి. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో అన్నం లేదా చపాతీతో పప్పు, ఆకు కూరలు, కాయగూరలు, “మాంసాహార” వంటలు, పెరుగు తీసుకోవాలి. రాత్రి నిద్రకు ఉపక్రమించే రెండు గంటల ముందే భోజనాన్ని ముగించాలి. మధ్యల్లో స్నాక్స్ కోసం ఉడికించిన వేరు శెనగ, వేయించిన బఠాణీలు, సెనగలు, నానబెట్టిన బాదం, ఆక్రోట్, అన్ని రకాల పండ్లు, ఉడికించిన సెనగలు, అలసందలు, బొబ్బర్లు, పెసలు లాంటి పప్పు దినుసులు తీసుకుంటే తగినంత శక్తి లభిస్తుంది. వీటి ద్వారా శరీరానికి కావలసిన ప్రొటీన్, ఐరన్, జింక్ వంటి పోషకాలు అందుతాయి. రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలు ఒక కప్పు తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది. దీంతో పాటు తేలికపాటి వ్యాయామం చేస్తుంటే జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది. కాఫీ, టీలు, ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. తగినన్ని నీళ్లు తీసుకోవాలి.
కోవిద్ తగ్గాక ఈ ఆహారం తీసుకోండి
Related tags :