ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల అధికారులతో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గోదావరి వరద పరిస్థితిపై కలెక్టర్లను అడిగితెలుసుకున్నారు. అధికారులంతా సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. వరద ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున ఆర్థిక సాయం ఇస్తామన్నారు. వచ్చే మూడ్రోజుల్లో గోదావరి వరద క్రమంగా తగ్గుతుందన్న సీఎం…ఆ తర్వాత 10 రోజుల్లోనే పంట నష్టం అంచనాలు పంపించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్, సమాచార వ్యవస్థలను త్వరగా పునరుద్ధరించాలని సూచించారు. సహాయక చర్యల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
వరద బాధిత కుటుంబానికి ₹2వేలు
Related tags :