ScienceAndTech

ఐసిస్ కోసం బెంగుళూరులో యాప్ తయారీ

ఐసిస్ కోసం బెంగుళూరులో యాప్ తయారీ

ఐసిస్‌ ఉగ్రవాదుల కోసం పనిచేస్తున్న ఓ వైద్యుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు బెంగళూరులో అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన అబ్దుల్‌ రహమాన్‌ (28) అనే యువకుడు రామయ్య వైద్య కళాశాలలో ఆప్తమాలజీ విభాగంలో జూనియర్‌ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. యుద్ధంలో గాయపడిన ఐసిస్ ఉగ్రవాదులకు సహాయపడేందుకు మెడికల్ యాప్‌తో పాటు ఆయుధాల సమాచారానికి సంబంధించిన యూప్‌ను కూడా రెహమాన్ రూపొందిస్తున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. అతడి నుంచి డిజిటల్‌ సామగ్రి, మొబైల్ ఫోన్, లాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా అబ్దుల్‌ రెహమాన్‌ 2014లో సిరియాలోని ఐసిస్ మెడికల్ క్యాంప్‌ను సందర్శించి, అక్కడే పది రోజుల ఉండి తర్వాత భారత్‌కు తిరిగి వచ్చినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో అతడిని దిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలించనున్నట్టు అధికారులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం పుణెలో ఐసిస్‌తో సంబంధాలు కలిగిన కొందరిని ఎన్‌ఐఏ వర్గాలు అరెస్టు చేశాయి. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా రెహమాన్‌పై నిఘా ఉంచిన దర్యాప్తు సంస్థ మంగళవారం అతడిని అరెస్టు చేసింది.