ఆ రోజుల్లో కడుపు నిండా తిని వళ్లు అలిసేలా పనిచేసేవారు. అప్పుడు దానికిదీనికి సరిపోయేది. ఇప్పుడు కడుపునిండా తిన్నా తినకపోయినా కూర్చొనే పనిస్తుండడంతో శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి నేటి యువతరం డైట్ ఫాలో అవుతున్నారు. దీనికోసం పెద్దగా కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం లేదు. తమ డైట్‌లోకి ఒక టమాటాను చేర్చుకుంటే సరిపోతుంది. అంతేకాదు టమాటా వల్ల మరెన్నో ప్రయోజనాలున్నాయి అవేంటో ఓ సారి తెలుసుకోండి.
* టమాటాలో గ్లూటాథియోన్ సమృద్ది ఉంటుంది. ఇది క్యాన్సర్ వంటి మహమ్మారిని దరిచేరకుండా చేస్తుంది.
* ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని మృదువుగా, అందంగా తయారయ్యేలా చేస్తుంది.
* విటమిన్ సి, కే, ఐరన్, ఫోలేట్, పొటాషియం వంటి మినరల్స్ టమాటాలో పుష్కలంగా ఉంటాయి.
* టమాటాలో ఉండే బీటా కెరోటిన్, లైకోపీన్ కంటికి మేలు చేస్తుంది. కంటిచూపును మెరుగుపరిచేందుకు టమాటా పనిచేస్తుంది.
* మతిమరుపు ఉన్నవారికి టమాట మేలు చేస్తుంది. అంతేకాదు డిప్రెషన్, టెన్షన్ వంటి సమస్యలను టమాటా దూరం చేస్తుంది.
* శరీరంలోని గ్లూకోజ్ లెవెల్స్‌ని టమాటాలు బ్యాలెన్స్ చేస్తాయి. మధుమేహంతో బాధపడేవారు టమాటాలు తింటే మంచిదంటున్నారు నిపుణులు.
* గర్భిణీ మహిళలు టమాటాలు తింటే మంచిది. అలాగే గుండె సమస్యలు ఉన్నవారికి కూడా టమాటా ఉపయోగపడుతుంది.
* ఇందులో ఉండే మెగ్నీషియం ఎముకలను దృఢంగా ఉంచుతుంది. అలాగే టమాటాలు బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది.
* అధికంగా రక్తం గడ్డకడితే గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దాన్ని కంట్రోల్ చేయడానికి రోజుకో టమాటా తింటే సరిపోతుంది.
* బరువు తగ్గాలనుకునేవారికి టమాటాలు బాగా పనిచేస్తాయి. క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్‌లో టమాటా కూడా యాడ్ చేసుకొని తాగితే రక్తం మెరుగవ్వడంతోపాటు వెయిట్‌లాస్ అవుతారు.