Fashion

మెనోపాజ్‌కి అరికాలి మంటలకు సంబంధం ఉందా?

మెనోపాజ్‌కి అరికాలి మంటలకు సంబంధం ఉందా?

నాకు కిందటేడాదే మెనోపాజ్‌ మొదలైంది. అప్పటి నుంచి అరికాళ్లలో విపరీతమైన మంటలు. లావూ పెరిగా. త్వరగా అలసిపోతున్నా. మితంగా సమతులాహారం తీసుకుంటున్నా… వ్యాయామం చేసినా పొట్ట తగ్గడం లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది? — Sister, హైదరాబాద్‌

మెనోపాజ్‌ మొదలవడంతో హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి ఈ సమస్యలన్నీ తలెత్తొచ్ఛు వీటిని మెనోపాజల్‌ సిండ్రోమ్‌ అంటారు. తరచుగా మూత్రసంబంధ సమస్యలు రావడం, ఆ ప్రాంతం పొడిబారడం… ఇవన్నీ వ్యాసోమోటార్‌ లక్షణాలే. శరీరం నుంచి వేడి గాలులు రావడం, చెమటలు పట్టడం, అరికాళ్లలో మంటలు, నిద్రలేమి, విసుగు, చిరాకు, కోపం, మూడ్‌స్వింగ్స్‌… ఇవన్నీ మెనోపాజ్‌లో కనిపించే లక్షణాలు. హార్మోన్లలో తేడాల వల్లే మీరు బరువు పెరిగారు. వ్యాయామం చేసినా బరువు తగ్గడం లేదు. అలాగని మీరు ఎక్సర్‌సైజ్‌లు చేయడం ఆపొద్ధు మెనోపాజ్‌ తర్వాత కొంతకాలానికి ఎముకలు బలహీనంగా మారతాయి. కాబట్టి క్యాల్షియం సప్లిమెంట్లను తీసుకోవాల్సి ఉంటుంది. మీ ఉత్తరాన్ని బట్టి చూస్తే మీలో వ్యాసోమోటార్‌ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకసారి వైద్యులను సంప్రదిస్తే వారు సరైన మాత్రలను సూచిస్తారు. సమతులాహారం తీసుకుంటూ, వ్యాయామం చేసినప్పుడు మాత్రమే అధిక బరువు అదుపులో ఉంటుంది. మరీ తప్పనిసరి సందర్భంలో మాత్రమే హార్మోన్‌ రిప్లేస్‌మెంట్‌ జరుగుతుంది. అరికాళ్లలో మంటలు అంటున్నారు కాబట్టి ఈ వయసులో మధుమేహం, బి12 లేమి కలగవచ్ఛు వీటికి సంబంధించిన పరీక్షలూ చేయించుకోండి.