Food

ఫాస్ఫరస్ మెగ్నీషియం బ్రౌన్ రైస్‌లో పుష్కలం

ఫాస్ఫరస్ మెగ్నీషియం బ్రౌన్ రైస్‌లో పుష్కలం

ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యానికి ప్రాధాన్యత‌ ఇస్తున్నారు. మూడు పూట‌ల తినే ఆహారం విష‌యంలో చాలా శ్ర‌ద్ధ తీసుకుంటున్నారు. భార‌తీయులు ఎంతో ఇష్టంగా తినే ఆహారం వ‌రి, గోధుమ‌లే. వైట్‌రైస్ తిన్న‌వెంట‌నే ఎంతో ఎన‌ర్జీనిస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శ‌రీరంలో మ‌రీ ఎక్కువైనా ప్ర‌మాద‌మే. అందుకే వైట్‌రైస్‌కు బ‌దులుగా అప్పుడ‌ప్పుడు బ్రౌన్‌రైస్‌ను తిన‌మ‌ని చెబుతున్నారు నిపుణులు. ఇందులో బోలెడ‌న్ని పోష‌కాలు దాగున్నాయి. త‌క్కువ కేల‌రీల‌తోపాటు ఎక్కువ ఫైబ‌ర్ దాగున్న బ్రౌన్‌రైస్‌ను తిన‌డం వ‌ల్ల చాలా ప్ర‌యోజ‌నాలున్నాయి. మ‌రి అవేంటో ఒక‌సారి చూసేయండి.

* బ్రౌన్‌రైస్‌లో పాస్ప‌ర‌స్‌, మెగ్నీషియం, నియాసిన్‌, థ‌యామిన్‌, పాస్ప‌ర‌స్‌, విట‌మిన్ బి6 వంటి మిన‌ర‌ల్స్ పుష్క‌లంగా ఉన్నాయి.

* ఇందులోని మెగ్నీషియం ఎముక‌ల‌ను దృఢంగా చేస్తుంది.

* డైట్ ఫాలో అయ్యేవాళ్ల ఆహారంలో బ్రౌన్‌రైస్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి.

* బ్రౌన్‌రైస్ తిన‌డం వ‌ల్ల త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.

* మ‌ధుమేహానికి కార‌ణ‌మ‌య్యే మెట‌బాలిక్ సిండ్రోమ్‌ను బ్రౌన్‌రైస్ నియంత్రిస్తుంది.

* అలాగే గుండెపోటును కంట్రోల్ చేయ‌డానికి కూడా ఎంతో తోడ్ప‌డుతుంది.

* మ‌తిమ‌రుపుతో బాధ‌ప‌డేవారికి బ్రౌన్‌రైస్ బాగా ప‌నిచేస్తుంది.

* అల్జీమ‌ర్స్‌, డిమోన్షియా వంటి వ్యాధుల‌ను సైతం దూరం చేయ‌డానికి బ్రౌన్‌రైస్ బేష్‌!

* ఆస్త‌మాతో బాధ‌ప‌డేవారు వారానికి మూడురోజులు బ్రౌన్‌రైస్ తింటే 50 శాతం వ‌ర‌కు ముప్పు త‌గ్గిన‌ట్లే అంటున్నారు నిపుణులు.

* ఉబ్బ‌సం నుంచి విముక్తి పొందేందుకు బ్రౌన్‌రైస్ తినాల్సిందే!