Movies

నిజం ఒప్పుకున్న రియా

నిజం ఒప్పుకున్న రియా

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య చేసుకోవడానికి అతడి స్నేహితురాలు రియా చక్రవర్తి కూడా ఒక కారణమని ఆయన కుటుంబ సభ్యులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్‌ నుంచి రూ.15కోట్లు రియా చక్రవర్తి తీసుకున్నట్లు ఆయన తండ్రి కేకే సింగ్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి తన లాయర్లతో కలిసి ఒక ప్రకటన విడుదల చేసింది. సుశాంత్‌ నుంచి నగదు తీసుకున్నట్లు ఆయన కుటుంబం చేస్తున్న ఆరోపణలను అందులో ఖండించింది. అసలు తనకు ఆ కుటుంబంతో పరిచయం పెద్దగా లేదని స్పష్టం చేసింది. ‘‘కొన్నేళ్లుగా రియా, సుశాంత్‌లు ఒకరికొకరు తెలుసు. ఒకే ఇండస్ట్రీలో పనిచేస్తుండటంతో ఇద్దరి మధ్యా స్నేహం ఉంది. అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్లు. ఏప్రిల్‌ 2019లో జరిగిన ఓ పార్టీకి కలిసి హాజరయ్యారు. అప్పటి నుంచి ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. డిసెంబరు 2019 నుంచి ఇద్దరూ బాంద్రాలో కలిసి జీవించడం మొదలు పెట్టారు. జూన్‌ 8, 2020న సుశాంత్‌ ఇంటి నుంచి రియా వెళ్లిపోయింది. ప్రస్తుతం సుశాంత్‌ కుటుంబం చేస్తున్న ఆరోపణలు అర్థరహితం. అవన్నీ కల్పితాలు. ముంబయి పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రియా ఆర్థిక లావాదేవీలను పరిశీలించాయి. సుశాంత్‌ బ్యాంకు ఖాతాల నుంచి ఆమెకు ఎలాంటి లావాదేవీలు జరగలేదు. రియా ఆదాయపుపన్ను వివరాలను కూడా పోలీసుల, ఈడీ పరిశీలించారు. చట్ట ’వ్యతిరేకంగా ఎలాంటి అవతకతవకలు కనిపించలేదు’’