Movies

సునీతకు కరోనా

సునీతకు కరోనా

కరోనా వైరస్ వైరస్ విజృంభణ కొనసాగుతూనే వుంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు పడ్డారు. తాజాగా టాలీవుడ్ సింగర్స్ సునీత,మాళవిక కరోనా బారిన పడ్డారు. ఇటీవల వారు ఓ టీవీ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అందులోనే వారికి కరోనా సోకినట్టుగా సమాచారం. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారు…. పరీక్షలు చేయించుకోగా వారికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం వీరు హోం క్వారంటైన్ లో ఉండి డాక్టర్ల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నారు. మరో వైపు టాలీవుడ్ ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాబారిన పడి కోలుకుంటున్నారు. అదే విధంగా బండ్ల గణేష్, రాజమౌళి, డీవీవీ దానయ్య, తేజ, నాగవంశీ మరికొంత మంది ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇప్పుడు సింగర్స్ సునీత, మాళవికకు పాజిటివ్ రావడం అందరు ఆందోళన చెందుతున్నారు.