* జేసీ ప్రభాకర్‌రెడ్డికి బెయిల్ మంజూరు
* అనంతపురం జిల్లా ట్రెజరీలో పని చేస్తున్న ఉద్యోగి ఓ ఇంట్లో దాచిన బంగారు, వెండి ఆభరణాలు, నగదును పోలీసులు భారీగా పట్టుకున్నారు. తన డ్రైవర్ మామ ఇంట్లో 8 ట్రంకు పెట్టెల్లో దాచినట్లు పోలీసుల తనిఖీల్లో వెలుగు చూసింది. వీటితో పాటు మూడు ఫిస్టోల్స్ , 18 రౌండ్లు, ఒక ఎయిర్ గన్ , ఫిక్స్డ్ /ఎన్ ఎస్ ఎస్ బాండ్లు, ఫ్రాంసరీ నోట్లు, పలు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సదరు ఇంట్లో మారణాయుధాలు ఉన్నాయన్న సమాచారంతో జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు సి.సి.ఎస్ డీఎస్పీ ఇ.శ్రీనివాసులు, అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి, తాడిపత్రి డీఎస్పీ ఎ.శ్రీనివాసులు, ట్రైనీ డీఎస్పీ చైతన్య ల ఆధ్వర్యంలో బుక్కరాయసముద్రం సి.ఐ సాయి ప్రసాద్ , సి.సి.ఎస్ సి.ఐ శ్యాంరావు, బుక్కరాయసముద్రం ఎస్సై ప్రసాద్ మరియు సిబ్బంది తనిఖీలు చేసి ఈ భారీ నిల్వలు బయటపెట్టారు.
* సుప్రీంకోర్టులో బాలీవుడ్ నటుడు సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తికి ఎదురుదెబ్బ తగిలింది. సుశాంత్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను ఆదేశించింది. సీబీఐకి సహకరించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. బీహార్ సీఎం వినతి మేరకు కేసును ఇప్పటికే సీబీఐకి కేంద్రం అప్పగించింది. అవసరమనుకుంటే కొత్తగా కేసు ఫైల్ చేసేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చింది. ముంబైలో జూన్ 14న బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి చెందిన విషయం తెలిసిందే. హీరో సుశాంత్ సింగ్ మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉందని అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే అన్ని అంశాలు బయటకు రావాలని చెబుతూ.. కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
* గోదావరిలో దూకిన కుటుంబ సభ్యులుపశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు రోడ్ కం రైల్ బ్రిడ్జి పై నుండి దూకి పసివేదల గ్రామానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య.పరిమి సునీత(50),కుమారుడుపరిమి ఫణి కుమార్ (25), కుమార్తె పరిమి లక్ష్మీ అపర్ణ (23).పరిమి సునీత భర్త నరసయ్య ఈనెల 16వ తారీకున కరోనా పాజిటివ్ తో మృతి.కనీసం కుటుంబ సభ్యులు సైతం పలకరించడానికి రాకపోవడంతో మనస్తాపానికి గురైన కుటుంబము.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.