WorldWonders

బిడ్డ కోసం సైకిల్‌పై 100మైళ్లు…ఓ సాహస తండ్రి గాథ

బిడ్డ కోసం సైకిల్‌పై 100మైళ్లు…ఓ సాహస తండ్రి గాథ

‘పదో తరగతి పరీక్షలు.. ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి దాదాపు 100 మైళ్లకు పైగా దూరం. లాక్‌డౌన్‌తో పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేవు. తన దగ్గర బైక్‌, కార్‌ లాంటి వాహనాలూ లేవు. కానీ చదువు ఎంతో ముఖ్యమో అర్థం చేసుకున్నాడు. చేసేది ఏం లేక సైకిల్‌పై 105 కిలోమీటర్లు ప్రయాణించి పరీక్ష హాల్‌కు చేరుకున్నాడు’. ఇదంతా కొడుకు చదువు కోసం తండ్రి పడిన ఆరాటం. స్వతహాగా తను చదువుకోక పోయినా..కొడుకు అయినా ఉన్నత విద్యావంతుడు కావాలని ఓ తండ్రి చేసిన ఆలోచన. 15 ఏళ్ల కొడుకును సైకిల్‌పై కూర్చొబెట్టుకొని వంద కిలోమీటర్లు ప్రయాణించి తమ పిల్లల కోసం ఏమైనా, ఎంతైనా చేయగలమని నిరూపించాడు ఆ తండ్రి. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. శోభ్రామ్‌ అనే 38 ఏళ్ల వ్యక్తికి పదో తరగతి చదివే కొడుకు ఆశిష్‌ ఉన్నాడు. అతనికి సప్లిమెంటరీ పరీక్షలు దగ్గర పడ్డాయి. ఆశిష్‌ను సైకిల్‌పై ఎక్కించుకొని 105 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధార్ పట్టణానికి తీసుకెళ్లాడు. అక్కడ పరీక్ష రాయించి తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు.