Health

మురికి కాల్వల్లో నివసిస్తున్న కరోనా వైరస్

మురికి కాల్వల్లో నివసిస్తున్న కరోనా వైరస్

కరోనా వ్యాప్తిని గుర్తించడం కోసం పరిశోధకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పరిశోధనల్లో రోజురోజుకి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా వైరస్ ఒకరి నుంచి మరోకరికి వ్యాపిస్తుందని ఇప్పటి వరకు మనం విన్నాం. కరోనా బాధితుడు దగ్గినప్పుడు, తమ్మినప్పుడు.. తప్పర్ల ద్వారా కరోనా రోగికి దగ్గరగా ఉన్నప్పుడు వ్యాధి విస్తరిస్తుంది. లేదా కరోనా రోగి వాడిన వస్తువు ద్వారా వ్యాపిస్తుందని తెలుసు. అయితే ముక్కు, నోటి ద్వారానే కాకుండా మలమూత్ర విసర్జనలోనూ వైరస్ వ్యాప్తి జరుగుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. మురుగునీటిలో కరోనా వైరస్‌ ఆనవాళ్లు ఉన్నాయని సీసీఎంబీ, ఐఐసీటీ సంయుక్త పరిశోధనల్లో తేల్చి చెప్పింది. మురుగునీటి నమూనాలలో కరోనా వైరస్‌పై పరిశోధనలు చేశారు. ముక్కు, నోటి ద్వారానే కాకుండా మలమూత్ర విసర్జనలోనూ వైరస్ ఉంటుందని, వ్యాధి సోకిన 35 రోజుల వరకు పేషెంట్ శరీరంలో వైరస్‌ ఉంటుందని సీసీఎంబీ, ఐఐసీటీ సంయుక్త పరిశోధనల్లో తేల్చిచెప్పింది.