దేశంలో నకీలీగాళ్లు ఎక్కువయ్యారు. సినీ, రాజకీయ ప్రముఖుల పేరుతో అక్రమాలు సృష్టిస్తున్నారు. దీనికి సంబంధించిన ఘటనలు ఇటీవల కాలంలో చాలానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో నకిలీ వెబ్సైట్ నిర్వహిస్తోన్న ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలకు బీమా అంటూ ఏకంగా ప్రధాని పేరుతో నకిలీ పథకాన్ని సృష్టించి వేల మంది నుంచి డబ్బులు కాజేశారని పోలీసులు గుర్తించారు. ‘ప్రధానమంత్రి శిశు వికాస్ యోజన’ అనే నకిలీ వెబ్సైట్ నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించినట్లు తెలుస్తోంది. అరెస్టయిన వారిలో బిహార్ కు చెందిన నీరజ్ పాండే, సువేందర్ యాదవ్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆదర్శ్ యాదవ్ ఉన్నట్లు తెలిపారు. వీరు నిర్వహిస్తున్న వెబ్సైట్లో ఇప్పటివరకు 15 వేల మంది ప్రజలు తమ పేరును నమోదు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఏకంగా నరేంద్ర మోడీ పేరుతోనే కుంభకోణాలు
Related tags :