2020 ఐపీఎల్ టైటిల్ స్పాన్సరర్‌గా బీసీసీఐ ‘డ్రీమ్11’ను ఎంచుకోవడాన్ని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) వ్యతిరేకించింది. డ్రీమ్11లో చైనా పెట్టుబడులు ఉన్నాయని పేర్కొంటూ బుధవారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీకి లేఖ రాసింది. ‘2020 ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను డ్రీమ్11కు అప్పగించడంతో తీవ్ర కలత చెందాం. ఆ సంస్థలో చైనా పెట్టుడబులు ఉన్నాయి. చైనాకి చెందిన టెన్సెంట్ గ్లోబల్ అనే సంస్థ డ్రీమ్11లో ముఖ్య వాటాదారు’ అని పేర్కొంది. ‘డ్రీమ్11కు స్పాన్సర్‌షిప్‌ను కట్టబెట్టడం చైనా వస్తువులను బహిష్కరిస్తున్న భారతీయుల మనోభావాలను దెబ్బదీయడమే’ అని చైనా వస్తువులను బహిష్కరించాలనే ప్రచారానికి నాయకత్వం వహిస్తున్న సీఏఐటీ ఆ లేఖలో స్పష్టం చేసింది.
భారత్ క్రికెట్‌ను వదలని చైనా పీడ
Related tags :