Politics

జగన్‌కు రఘురామ మరో విన్నపం. కొట్టిపారేసిన వెల్లంపల్లి.

జగన్‌కు రఘురామ మరో విన్నపం. కొట్టిపారేసిన వెల్లంపల్లి.

కోవిద్ నిబంధనలు పాటిస్తూ వినాయక మండపాలను ఏర్పుటు చేసుకొని వేడుకలను జరుపుకొనే వారికీ ఎటువంటి ఆటంకాలు కలిగించవద్దని పోలీస్, రెవిన్యూ, ఇతర అధికారాలను ఆదేశించాలని ముఖ్యమంత్రి జగన్‌కు ఎంపీ రఘురామరాజు విన్నవించారు. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాలు తెరిచి వినాయక వేడుకలు జరుపుకొనే మండపాల విషయంలో అనుమతులు ఇవ్వక పోవడం , వాటికీ ఆటంకాలు కలిగించడం మంచిది కాదు .హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ వినాయకచవితి ఉత్సవాలు . అన్ని విగ్నాలను తొలిగించే దేముడుగా వినాయకుడుని హిందువులు భావిస్తారు . ఏ పని మొదలు పెట్టిన ముందుగా వినాయకుడిని పూజిస్తారు .ఎంతో ప్రాముఖ్యత వున్న వినాయక వేడుకలకు నిబంధనలు పేరిట రాష్ట్ర ప్రభుత్వం విఘ్నలు కలిగించడం హిందువుల మనోభావాలను గాయపరచడమే .స్వాతంత్ర ఉద్యమ కాలం నుండి వినాయక వేడుకలు సామూహికంగా కుల , మతాలకు అతీతంగా జరుపుకొనే సంప్రదాయం వుంది . అటువంటిది వినాయక మండపాల ఏర్పాటు చేసుకొంటున్న వారిని రాష్ట్రం లో అనేక చోట్ల పోలీసులు, ఇతర అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు . దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను .స్వాతంత్రం నా జన్మ హక్కు అన్ని మొట్టమొదటి సారిగా నినాదం ఇచ్చిన లోకమాన్య శ్రీ బాలగంగాధర్ తిలక్ ప్రజలంతా సామూహికంగా కుల , మతాలకు అతీతంగా వినాయక వేడుకలు జరుపుకొనే పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారువినాయక వేడుకలను ప్రజలు స్వచ్ఛందంగా నిర్వహించుకునే హక్కును రాష్ట్ర ప్రభుత్వం హిందూ మత పెద్దలతో , స్వామిజీలతో సంప్రదింపులు జరపకుండా ఏకపక్షం గా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు .రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం వినాయక మండపాలకు అనుమతి ఇస్తునట్లుగానే ఈ సంవత్సరం కూడా అనుమతులు ఇవ్వాలని , వినాయక నిమజనాలకు క్రేన్లు , ఇతర ఏర్పాట్లు చెయ్యాలని కోరుతున్నాను .రాష్ట్ర ప్రభుత్వం వినాయక వేడుకలు , మండపాలు ఏర్పాటు తదితర అంశాలు పై హిందుమత పెద్దలు, స్వామీజీ లు, మఠాధిపతులతో, హిందూ సంస్థలతో చర్చించాలని కోరుతున్నాను .

COVID-19 నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాలివినాయ‌క చవితి మండపాలకు అనుమతుల లేదు.ఈ సారికి ఇంట్లోనే…విఘ్నేశ్వర పూజలు…దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస రావు.క‌రోనా నేప‌ధ్యంలో ప్ర‌జ‌లు కోవిద్ -19 నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని, ఈ ఏడాదికి ప్ర‌జ‌లు అంద‌రు వారివారి గృహ‌ల్లోనే విఘ్నేశ్వర పూజలు నిర్వ‌హించుకోవాల‌ని దేవాదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస రావు తెలిపారు..బుధ‌వారం స‌చివాలంలో దేవ‌దాయ శాఖ మంత్రి కార్యాల‌యంలో దేవ‌దాయ క‌మిష‌న‌ర్ పి.అర్జున‌రావు, దేవ‌దాయ శాఖ జాయింట్ క‌మిష‌న‌ర్ అజాద్ మ‌రియు డైరెక్ట‌ర్ ఫ‌ర్ హెల్త్ అరుణ‌కుమారి, లా అండ్ అర్డ‌ర్ అడిష‌న‌ల్ డిజి రాజ‌శేఖ‌ర్‌, డైరెక్ట‌ర్ ప్రోటోకాల్ బాల‌సుబ్ర‌మ‌ణ్యం, అసిస్టెంట్ సెక్ర‌ట‌రీ పొటోకాల్ రాంసుబ్బ‌య్య‌, త‌దిత‌రులతో మంత్రి వెలంప‌ల్లి ‌స‌మావేశం నిర్వ‌హించారు.క‌రోనా నేప‌థ్యంలో ఇత‌ర రాష్ట్రాలైన త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌లో జ‌రుగుతున్న విధానాల‌ను అధ్య‌య‌నం చేయ‌డం జ‌రిగింద‌న్నారు, అదే విధంగా రాష్ట్ర‌ప్ర‌భుత్వ నిభంధ‌న‌ల‌ను వివ‌రించారు.రెండు అడుగులలోపు వినాయ‌కుని విగ్ర‌హాలను మాత్ర‌మే పూజలు చేయ‌డం, అదే రోజు ఎక్క‌డ విగ్ర‌హాల‌ను అక్క‌డే నిమ‌జ్జ‌నం చేయాల‌న్నారు.ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను ఏర్పాటు చేయడం లేదా బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు అనుమతింంచ‌డం లేద‌న్నారు… అదేవిధంగా ఊరేగింపులు మరియు విగ్రహాన్ని న‌దులు, చెరువులో ముంచడం లేదున్నారు.. క‌రోనా నివార‌ణకు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని, అంద‌రూ వ్యక్తిగతంగా ఇంట్లోనే…విఘ్నేశ్వర పూజలు నిర్వ‌హించుకోవాల‌ని మంత్రి వెలంప‌ల్లి కోరారు….ప్ర‌జ‌లు బ‌హిరంగ ప్రదేశాలలో/ మార్కెట్ త‌దిత‌ర ప్రదేశాలను సంద‌ర్శించిన్న‌ప్ప‌డు త‌ప్ప‌నిస‌రిగా సామాజిక దూరం, ఫేస్ మాస్క్ ధరించాలని, అదే విధంగా దుకాణ‌దారులు నిబంధ‌న‌లు పాటించాలి.ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేట్ ఆల‌యాల్లో ప్రభుత్వం జారీ చేసిన నిభంధ‌న‌ల ప్ర‌కారం ప‌రిమితి సంఖ్య‌లో 10మందితోనే సామాజిక దూరం పాటిస్తూ, ఫేస్ మాస్క్ ధ‌రించి పూజలు నిర్వ‌హించుకోవాల‌న్నారు.,అన్నీ దేవాల‌యాల్లో వినాయ‌కుని పూజ‌లు సంప్ర‌దాయ ప్ర‌కారం నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌న్నారు,,COVID-19 మహమ్మారి వ్యాప్తి చెందకుండా నిబంధ‌న‌ల పాటించాలన్నారు.