శ్రీశైలం రిజర్వాయర్ మూడు గేట్లు ఎత్తి నీటి విడుదల చేశారు. ఈ సీజన్‌లో తొలిసారి శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు అధికారులు ఎత్తారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల చేశారు. శ్రీశైలం, తుంగభద్ర డ్యాంలకు వరద కొనసాగుతోంది. ఎగువన భారీ వర్షాలతో జలాశయాలు కళకళలాడు తున్నాయి. ఎగువ నుంచి నీరు వస్తుండడంతో శ్రీశైలం రిజర్వాయర్ నిండుకుండలా మారింది. శ్రీశైలం రిజర్వాయర్ ఇన్‌ఫ్లో-3.85 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం-885 అడుగులు, ప్రస్తుతం-881.30 అడుగులు వరకు నీరు ఉంది. ఎగువన కర్ణాటక, తెలంగాణాల్లో భారీ వర్షాలు పడుతుండడంతో వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తుంగభద్ర, కృష్ణాలో ప్రవాహంపై నీటి పారుదలశాఖ, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
శ్రీశైలం గేట్లు ఎత్తివేత
Related tags :