మామూలుగా అయితే ఇనుప వస్తువులు కొంత కాలం వాడకపోతే తుప్పు పడుతుంటాయి. తుప్పు పట్టడమనేది ఓ రసాయనిక చర్య. సాధారణంగా ఇనుము, జింకు, రాగి వంటి లోహాలు తుప్పు పడతాయి. ఇనుము తుప్పు పట్టడం అంటే ఇనుప వస్తువులు, గాలిలో ఉన్న నీటి ఆవిరి, ఆక్సిజన్ వాయువులో కలిసి తదుకు Fe2o3. 2H2O అనే సంయోగ పదార్థాన్నే మనం సాధారణంగా తుప్పు అంటాం. రసాయనిక తమంత తాముగా ఎవరి ఆజమాయిషీ లేకుండా ప్రకృతి సిద్ధంగా జరిగే చర్యల్లో సాధారణంగా శక్తి ఎక్కువగా ఉన్న రూపం నుంచి పదార్థాలు శక్తి తక్కువగా ఉన్న రూపంలోకి వెళ్లడానికి ఉత్సాహం చూపిస్తాయి. ఆ రీత్యా బంగారం అనే మూలక రూప వస్తువు శక్తి కన్నా బంగారం తుప్పు పడితే ఏర్పడే Auo2 అనే తుప్పు సంయోగ పదార్థాపు శక్తి ఎక్కువ. అంటే బంగారం తుప్పు కన్నా బంగారానికే రసాయనిక స్థిరత్వం ఎక్కువ. కాబట్టి బంగారం సహజంగా తుప్పు పట్టదు. దాని సహజరూపం ప్రకృతిలో మూలక రూపమే. కానీ ఇనుము సహజ రూపం ఖనిజ రూపమైన తుప్పు రూపమే!
బంగారానికి తుప్పు ఎందుకు పట్టదు?
Related tags :