ప్రముఖ పేమెంట్స్ యాప్‘గూగుల్ పే’ ప్లే స్టోర్‌లో కనిపించకుండా పోవడం, ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసుకున్న మొబైళ్లలో సరిగా పనిచేయకపోవడంతో యూజర్లు ఇటీవల అయోమయానికి గురయ్యారు..
ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను తొలిగించారా అంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో సందేహాలు వ్యక్తం చేశారు. దీనిపై గూగుల్ పే ఇండియా స్పందించింది.
కొంతమంది యూజర్లకు ఆగస్టు 17న గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ కనపడలేదని, అనంతరం సమస్యను పరిష్కరించామని ట్వీట్‌చేసింది. కాగా, ఇటీవల ఎస్బీఐ సర్వర్‌లో తలెత్తిన సమస్య వల్లే ఈ సమస్య ఏర్పడిందని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు.