Agriculture

నాగార్జున సాగర్ పరిసరాల్లో నిషేధాజ్ఞలు

నాగార్జున సాగర్ పరిసరాల్లో నిషేధాజ్ఞలు

సాగర్ సందర్శకులకు పోలీసు శాఖ వారి హెచ్చరిక . నాగార్జునసాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండుతన్నందున సాగర్ డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ వేగంగా ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతున్న పరిస్థితులలో నాగార్జునసాగర్, దాని చుట్టుపక్కల ప్రాంతాలు మరియు ఇతర ప్రాంతాల నుండి ఎవరు కూడా సాగర్ డ్యాం గేట్లు నీటి విడుదల దృశ్యాలను చూడడానికి రాకూడదని పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ ,నందికొండ మున్సిపాలిటీ వారు తీర్మానించారు. ప్రస్తుతము వాతావరణం చల్లగా ఉండి వర్షాలు కురుస్తున్న కారణంగా కరోనా వైరస్ వేగంగా ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కరోనా కట్టడి చేయడానికి సందర్శకులు ఎవరు సాగర్ రావద్దని స్థానిక ఎస్ఐ శీనయ్య తెలిపారు