Kids

డేగ మెడపై కాకి దాడి

డేగ మెడపై కాకి దాడి

డేగ(ఈగిల్ )తో పోరాడాలని ధైర్యం చేసే ఏకైక పక్షి కాకి డేగ వెనుకభాగంలో కూర్చుని మెడన మీద పొడుస్తుంది కాకి అయినా డేగ స్పందించదు. కాకితో పోరాడదు.

ఎందుకంటే కాకికోసం సమయం లేదా శక్తిని వృథా చేయదు డేగ. కేవలం తన రెక్కలను తెరిచి, ఆకాశంలో ఇంకా పైకి ఎదగడం ప్రారంభిస్తుంది.

డేగ పైపైకి ఎగిరి ఎదిగిన కొద్దీ కాకికి ఊపిరి పీల్చుకోవడం కష్టతరమౌతుంది. ఆపై ప్రాణవాయు లేకపోవడం వల్ల కాకి క్రింద పడిపోతుంది.

కాకులతో మీ సమయాన్ని వృథా చేయకండి. వాటిని మీ ఎత్తులకు తీసుకెళ్లండి వాటి శక్తియుక్తులు వాటికి అవగతమై అవే దారినిస్తాయి అనేది నీతి.