జెనరేషన్ పెరిగే కొద్దీ జీవన విధానంలో మార్పులు వస్తున్నాయి. బిజీ లైఫ్‌లో ఆహారం గురించి పట్టించుకోవడానికే సమయం ఉండడం లేదు. ఇది వరకు మూడు పూటలా భోజనం తినేవాళ్లు. ఇప్పుడు ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం. రాత్రులు కొంతమంది టిఫిన్ లేదంటే అన్నం తింటున్నారు. ఇప్పుడు దీన్ని కూడా స్కిప్ చేస్తున్నారు. డైరెక్టుగా లంచ్ చేసేస్తున్నారు. దీనివల్ల లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అసలే కరోనా. ఈ టైంలో ఇలా చేస్తే అంతే సంగతులు. అందుకే కొంచెం సమయాన్ని కేటాయించి స్ప్రౌట్స్ తయారు చేసుకోండి. మొలకెత్తించిన గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలెన్నో.. వీటి గురించి ఒకసారి తెలుసుకుంటే వద్దన్నా తినాలంటారు.
* జీర్ణసమస్యలు ఉన్నవారికి మొలకలు మెడిసిన్‌లా పనిచేస్తాయి.
* ఇందులో ఇనుము, క్యాల్షియం, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి.
* రాత్రి నానబెట్టి ఉదయాన్నే మూట కట్టుకొని మరుసటి రోజు తెరిచి చూస్తే మొలకలు వచ్చి ఉంటాయి. వీటిని ఉదయాన్నే తినడం వల్ల అంతగా ఆకలి కూడా అనిపించదు. దీంతో మధ్యాహ్నం భోజనం తక్కువగా తింటారు. ఇలా చేయడం తొందరగా బరువు తగ్గుతారు.
* వీటిలో ఉండే ఒమేగా-3 ప్యాటీ యాసిడ్లు రక్తనాళాల్లో మంచి కొలెస్ట్రాల్‌ని పెంచి చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి.
* మొలకలు మెదడుకు రక్త సరఫరాను మెరుగుపరచడంతోపాటు, పనితీరును మెరుగుపరుస్తుంది.
* అంతేకాదు ఒత్తిడికి గురయ్యేవాళ్లు మొలకలను ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
* కరోనా టైంలో మొలకల కన్నా మంచి ఆహారం ఇంకోటి లేదు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
* మొలకల్లో ఉండే విటమిన్ సి తెల్ల రక్తకణాలను ఉత్తేజితపరుస్తాయి. అలాగే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది.
* హార్మోన్ల అసమతుల్యతతో బాధపడే మహిళలకు మొలకలు ఉపశమనాన్నిస్తుంది.
* ఇందులో ఉండే గ్లుకోరాఫనిన్ అనే ఎంజైమ్ క్యాన్సర్‌ను దరిచేరకుండా చేస్తుంది.