ఆపిల్ ఐఫోన్ ప్రియులకు శుభవార్త. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ద్వితీయార్థం నాటికి మేడిన్ ఇండియా ఐఫోన్ 12 అందుబాటులోకి రానుందని బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది. ఇందుకు సంబంధించిన ఉత్పత్తి ప్రక్రియను తైవాన్‌కు చెందిన విస్ట్రాన్ కంపెనీ ఇప్పటికే ప్రారంభించినట్లు వెల్లడించింది. కర్ణాటకలోని కోలార్ జిల్లా నరసాపురలో గల ప్లాంటులో ఈ మేరకు ఐఫోన్ 12 కాంపోనెట్స్ ఉత్పత్తి మొదలైందని పేర్కొంది. ఈ నేపథ్యంలో విస్ట్రాన్ కంపెనీ దశల వారీగా దాదాపు 10 వేల మంది ఉద్యోగాలు కల్పించే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఇప్పటికే 2 వేల మంది స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడిచింది
బెంగుళూరు యాపిల్‌లో భారీగా ఉద్యోగాలు
Related tags :