వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖైరతాబాద్‌లోని గణపయ్య ధన్వంతరి నారాయణుడిగా భక్తులకు దర్శనిమస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ దఫా విగ్రహం నిర్మాణాన్ని 9 అడుగులకే పరిమితం చేశారు. కొవిడ్ మహమ్మారికి ఔషధం తెచ్చే ధన్వంతరి నారాయణ గణపతిగా స్వామి దర్శనమిస్తున్నారు. చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో ఉన్న వినాయకుడికి కుడివైపున మహాలక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతి కొలువుదీరారు. కరోనా దృష్ట్యా భక్తులకు నేరుగా అనుమతి లేదని.. www.ganapathideva.org వెబ్‌సైట్ ద్వారా పూజా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ధన్వంతరిగా ఖైరతాబాద్ వినాయకుడు
Related tags :