Business

కైలాస రిజర్వ్ బ్యాంకు ప్రారంభోత్సవం

కైలాస రిజర్వ్ బ్యాంకు ప్రారంభోత్సవం

ప్రపంచమంతా కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ వల్ల వచ్చిన ఇబ్బందులతో సతమతమవుతోంది. కనీసం వినాయక చవితి వేడుకలను ఘనంగా చేసుకునే పరిస్థితి కూడా లేదు. అయితే, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న వివాదాస్పద స్వామిజీ నిత్యానందం మాత్రం తరచూ ఏదో ఒక చర్యతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా సొంతగా కరెన్సీ తీసుకొస్తున్నట్లు ప్రకటించిన ఆయన శనివారం గణేష్‌ చతుర్థిని పురస్కరించుకుని మరో సంచలన ప్రకటన చేశారు. ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ కైలాస’ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కైలాస అనేది నిత్యానంద ప్రపంచం. దానికి తనని తాను ప్రధానిగా ప్రకటించుకున్నారు. ఇటీవల కైలాస డాలర్‌ను కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ‘రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్ కైలాస’ను ప్రారంభించినట్లు ప్రకటించారు. వివిధ ఆరోపణల మీద 50 సార్లు కోర్టుకు హాజరైన నిత్యానంద.. గతేడాది నవంబరులో భారత్‌ వదలి పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఎక్కడ ఉంటున్నారనే విషయం మాత్రం తెలియదు. ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ ద్వీపంలో ఆయన నివాసం ఉంటున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈక్వెడార్‌ మాత్రం ఈ వార్తలను ఖండిస్తోంది.