Politics

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సరికొత్త ఊపు

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సరికొత్త ఊపు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది.

జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కమిటీకి ప్రత్యేక ఉప సంఘాలు, జిల్లా కమిటీలు ఏర్పాటు చేశారు.

వివిధ అంశాలపై నాలుగు ఉప సంఘాలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లాల సరిహద్దుల నియంత్రణ, న్యాయ వ్యవహారాల అధ్యయనం బాధ్యతను మొదటి సబ్‌ కమిటీకి అప్పగించారు.

సిబ్బంది పునర్విభజన అధ్యయన బాధ్యతలు రెండో ఉప సంఘం చూడనుంది.

మూడో సబ్‌ కమిటీకి ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయనం విధులు అప్పగించారు.

సాంకేతిక సంబంధిత అధ్యయనాన్ని నాలుగో సబ్‌ కమిటీకి కేటాయించారు.

రాష్ట్ర స్థాయి కమిటీ, సబ్‌ కమిటీలకు సహాయం కోసం జిల్లా స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.

కలెక్టర్‌ ఛైర్మన్‌గా పది మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది.

రాష్ట్ర స్థాయి కమిటీకి ప్రత్యేక సచివాలయం ఏర్పాటు చేస్తున్నారు.

వివిధ రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజనపై అధ్యయనం చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.