యూనివర్సిటీ కాలేజీ లండన్ పరిశోధకులు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ను పరీక్షించారు. దీని వేగం 178 టీబీ. అంటే సెకనుకు 1,78,000 జీబీలు అన్నమాట. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరుమీద ఉండేది. అప్పట్లో 44.2 టీబీపీఎస్ వేగాన్ని అందుకుని వారు రికార్డు సృష్టించగా.. తాజాగా రాయల్ అకాడమీ డాక్టర్ లిడియా గాల్డినో నేతృత్వంలోని పరిశోధకులు ఆ రికార్డును బ్రేక్ చేశారు. ఈ వేగాన్ని అందుకోవడానికి పరిశోధకులు సాధారణ ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌కు బదులు…..అధిక శ్రేణి కలిగిన తరంగ దైర్ఘ్యాలను వినియోగించారు. సిగ్నల్‌ను విస్తరించేందుకు కొత్త యాంప్లిఫైయింగ్ టెక్నాలజీ, 16.8THz బ్యాండ్ విండ్త్‌ను ఉపయోగించారు. ప్రస్తుతం భారత్‌లో ఇంటర్నెట్ సగటు వేగం 2ఎంబీపీఎస్‌గా ఉంది.
లండన్ కాలేజీలో 178TB ఇంటర్నెట్ వేగం
Related tags :