సీమంతం వేడుకను ఏడు, తొమ్మిది నెలల్లో చేస్తారు. తల్లి సౌభాగ్యాన్ని, పుట్టిబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గర్భవతికి గాజులు తొడిగి పండంటి బిడ్డను కనమని ఆశీర్వదిస్తారు. అలా తొడిగిన గాజులు గర్భకోశం సమీపంలో ఉన్న జీవనాడులపై ఒత్తిడి కలిగిస్తాయి. అలా ఎక్కువ గాజులు తొడగడం వల్ల గర్భకోశంపై సరైన ఒత్తిడి వచ్చి ప్రసవం సులభతరంగా జరుగుతుంది. అలాగే నెలలు నిండిన తరువాత శ్రమతో కూడిన పనులు చేయకూడదు. చేతులనిండా వేసుకున్న గాజులు కాబోయే అమ్మకు, ఇంటిలోని వారికీ ఈ సంగతి ప్రతీక్షణం గుర్తుచేస్తాయి.
సీమంతానికి గాజులకు సంబంధం ఏమిటి?
Related tags :