టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ అభిమానులు గొడవ పడటంపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో శనివారం ఇరు వర్గాల క్రికెట్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. గతవారం ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాక అతడి అభిమానులు ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టగా, తాజాగా రోహిత్ శర్మకు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం ప్రకటించడంతో అతడి అభిమానులు కూడా అదే పని చేశారు. అయితే, రోహిత్ అభిమానులు పెట్టిన బ్యానర్లు, ఫ్లెక్సీలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చించేశారని, దాంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగిందని ఓ వార్తా సంస్థ నిన్న ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలోనే రోహిత్ అభిమాని అయిన ఒక యువకుడిని ధోనీ అభిమానులు పంట పొలాల్లోకి తీసుకెళ్లీ మరీ దాడి చేశారని తెలిపింది.
సెహ్వాగ్ ఆగ్రహం
Related tags :