DailyDose

సినిమా షూటింగ్‌లకు కేంద్రం అనుమతులు-TNI బులెటిన్

సినిమా షూటింగ్‌లకు కేంద్రం అనుమతులు-TNI బులెటిన్

* ఆన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాల్లో భాగంగా సినిమాలు, టీవీ కార్యక్రమాల చిత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా చిత్రీకరణలు జరుపుకోవచ్చని తెలిపింది. ఈమేరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఆదివారం ఉదయం ఓ ప్రకటనలో చిత్రీకరణలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు.

* కరోనా మహమ్మారి నుంచి దూరంగా ఉండేందుకు ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క మందు మాస్క్ ధరించడం. ముఖానికి మాస్క్ ధరించడం ద్వారా ఈ వైరస్ నుంచి దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ విషయంలో పిల్లలు, పెద్దలు అందరూ మాస్కులు ధరిస్తుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. మాస్కుల విషయంలో తాజాగా సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. 12 ఏళ్లు పైబడిన పిల్లలకు పెద్దలకు మాదిరిగానే కరోనా వచ్చే అవకాశాలు ఉండడంతో వారు పెద్దలు ధరించినట్టుగానే మాస్కులు ధరించాలని పేర్కొంది. ఐదేళ్లలోపు పిల్లలు మాత్రం మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని, వీరికి కరోనా సోకే ప్రమాదం తక్కువని పేర్కొంది. 6 నుంచి 11 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులు మాత్రం రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం తప్పనిసరిగా మాస్క్ ధరించాలని వివరించింది. పిల్లలు ఆడుకునే సమయంలో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే, ఆ సమయంలో భౌతిక దూరం పాటించడం తప్పనిసరని స్పష్టం చేసింది.

* కరోనా దృష్ట్యా పరీక్షలు వాయిదా వేస్తున్నామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు వెల్లడించారు.

* దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మరి విజృంభణ.30 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు.దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 30, 44, 941 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ.గడచిన 24 గంటల్లో 69, 239 పాజిటివ్ కేసులు నమోదు కాగా 912 మంది మృతి.7, 07, 668 మందికి కొనసాగుతున్న చికిత్స.కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 22, 80, 566 మంది బాధితులు.కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 56, 706 మంది మృతి.నిన్న ఒక్కరోజే కోలుకున్న 57, 989 మంది బాధితులు.దేశవ్యాప్తంగా రికవరీ రేటు 74. 90%, మరణాల రేటు 1.86%.

* తెలంగాణ కొరొనా హెల్త్ బులిటెన్ విడుదలమళ్ళీ వరుసగా రెండోరోజు రెండు వేల మార్క్ దాటిన కొరొనా కేసులుఇవ్వాళ కొత్తగా 2384 కేసులు పాజిటివ్ నమోదుగడిచిన 24 గంటల్లో 11 మరణాలు–755 చేరిన సంఖ్యకొత్తగా 1851 రికవరీ అయినట్లు వైద్యశాఖ వెల్లడి–ఇప్పటి వరకు మొత్తం 80 586 నమోదుప్రస్తుతం ఆక్టివ్ కేసులు 22 908 ఉన్నట్లు ప్రకటనరాష్ట్రంలోని హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారి సంఖ్య–16 387 వైద్యశాఖ వెల్లడిGHMC-472, జగిత్యాల్-105, ఖమ్మం-105, కరీంనగర్- 125, నల్గొండ-137, నిజామాబాద్-148, రంగారెడ్డి-131, సూర్యాపేట – 110.

* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ కరోనా వైరస్ విజృభించింది. నిన్నామొన్నటివరకు పదివేల లోపు నమోదైన ఈ కేసుల సంఖ్య శనివారం పదివేలు దాటిపోయాయి. గత 24 గంటల్లో కొత్తగా 10,276 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో తూర్పుగోదావరి జిల్లాలో 1321, చిత్తూరులో 1220, పశ్చిమగోదావరిలో 1033, అనంతపురం జిల్లాలో 1020 కొత్త కేసులు నమోదయ్యాయి.