అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక మూర్ఖుడు, అబద్ధాల కోరు అని ఆయన సోదరి మరియన్నే ట్రంప్ బారీ ఆరోపించారు. ట్రంప్ ఎవరిని కూడా అంత త్వరగా నమ్మడని.. తన సిద్ధాంతాల కోసం ఏమైనా చేస్తాడని, ఎంతదూరమైనా వెళ్తాడని ఆమె విమర్శించారు. ఆయన మాట్లాడేవన్నీ అబద్ధాలేనని, ట్రంప్ ట్వీట్లు కూడా అలాగే ఉంటాయని అన్నారు. మరియన్నే న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని కూడా తప్పుపట్టారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చేసి డిటెన్షన్ సెంటర్కు తరలించడాన్ని ఆమె ఖండించారు. ఒక మతాన్ని నమ్మే వ్యక్తి ప్రజలకు సహాయంగా ఉంటాడని, ట్రంప్ మాత్రం దీనికి భిన్నమని మరియన్నే చెప్పారు. ట్రంప్ ఏమీ చదువుకోలేదని, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షను మరొకరితో రాయించారని ఆమె ఆరోపించారు. ట్రంప్ ఒక క్రూరుడని అభివర్ణించారు.
నా తమ్ముడు ఒక మూర్ఖుడు
Related tags :