* 8601 new cases in AP today. 86 dead due to carona.
* ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన తన వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారని.. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ జాబితా పెద్దదే. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు
* ఈ రోజు (24.08.20) తిరువూరు ఏరియా హాస్పిటల్ నందు తొమ్మిది మంది Covid అనుమానితులుకు Rapid Antigen Test kits ద్వారా పరీక్షలు చేయగా 6 మందికి పాజిటివ్ గా నిర్ధారించడమైనది.Vavilala PHC యందు ఒకరికి పజిటివ్ రిజల్ట్ వచ్చి ఉన్నది.తిరువూరు కు చెందిన వ్యక్తికి గంపలగూడెం PHC నందు చేసిన పరీక్షలో పాజిటివ్ ఫలితం వచ్చి ఉన్నది.మొత్తంగా ఈ రోజు తిరువూరు మండలం లో 8 పాజిటివ్ కేసు లు నమోదు అయినవి.Tahsildar Tiruvuru
* కరోనా పుట్టుకకు కేంద్రమైన చైనాలో టీకాలు వినియోగంలోకి వచ్చాయి! అయితే.. పూర్తిస్థాయిలో కాదు. అత్యవసర ప్రాతిపదికన మాత్రమే. కొన్ని దేశీయ కంపెనీలు అభివృద్ధి చేసిన టీకాలను.. కొవిడ్ బారిన పడే ముప్పు ఎక్కువగా ఉన్న ప్రజలకు అత్యవసర ప్రాతిపదికన అందించేందుకు చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ దేశంలో కరోనా టీకా అభివృద్ధి కార్యదళానికి నేతృత్వం వహిస్తున్న జెంగ్ జోంగ్‌వీ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. టీకాల అత్యవసర వినియోగాన్ని గత నెల 22 నుంచే ప్రారంభించినట్లు తెలిపారు. టీకాలు వేయించుకున్నవారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
* భారత్ లో కరోనా వైరస్ విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,408 కరోనా కేసులు నమోదవగా… 836 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం 31,06,348కి పాజిటివ్ కేసులు చేరాయి. అలాగే మొత్తం మరణాల సంఖ్య 57,542కి చేరింది. ఇక దేశంలో ప్రస్తుతం 7,10,771 యాక్టివ్ కేసులు ఉండగా… 23,38,035 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 57,469 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.