వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కోర్టు షాకిచ్చింది. వర్మ రూపొందిస్తున్న ‘మర్డర్’ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చింది. నల్గొండలో జరిగిన ప్రణయ్ హత్య కేసు ఆధారంగా వర్మ ‘మర్డర్’ సినిమా రూపొందిస్తున్నట్లు ఆయన ట్విట్టర్ పోస్టులను, సినిమా టీజర్‌ను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రణయ్ భార్య అమృత, తండ్రి బాలస్వామి కోర్టును ఆశ్రయించారు. తమ కుటుంబాన్ని సంప్రదించకుండా వర్మ సినిమా తీస్తున్నారని, తమ కులాన్ని కించపరిచేలా వర్మ సినిమా రూపొందిస్తున్నారని పిటీషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సినిమాతో ప్రణయ్ హత్య కేసు తప్పుదారి పడుతుందని అమృత, బాలస్వామి కోర్టుకు విన్నవించుకున్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు ‘మర్డర్’ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో అమృత తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. అయితే నల్గొండ జిల్లా కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్వర్వులపై హైకోర్టుకు వెళతామంటు వర్మ తరపు న్యాయవాది తెలిపారు.
వర్మ పైత్యానికి నల్గొండ కోర్టు బ్రేకులు

Related tags :