Movies

మూషిక మాఫియా

ఎలుకలు బయటకి వస్తున్నాయి

బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పూత్‌ మరణించిన దగ్గరి నుంచి బాలీవుడ్ పెద్దలపై నటి కంగనా రనౌత్ తన విమర్శలను తీవ్రతరం చేశారు. దాంతో బాయ్‌కాట్ కంగన అనే హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది. దీనిపై ఆమె స్పందిస్తూ.. ఇది తనను అణగదొక్కేందుకు బాలీవుడ్ మాఫియా చేసిన ప్రయత్నమంటూ విమర్శలు చేశారు. ‘అద్భుతం. బాయ్‌కాట్ కంగన హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఎలుకలు వాటి కలుగుల నుంచి బయటకు వస్తున్నాయి. మాఫియా అది చేయగలిగింది చేయడానికి ప్రయత్నిస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు.

స్టార్ల పిల్లల సినీ జీవితానికి మద్దతు ఇస్తూ, బయటివారిని ఎదగనీయకుండా మాఫియా మూకుమ్మడిగా పనిచేస్తోందంటూ ఆమె తరచూ ఆరోపణలు చేస్తున్న సంగ తెలిసిందే. అలాగే తన ట్విటర్ ఖాతా కూడా ఏ క్షణంలోనైనా నిలిపివేసే అవకాశం ఉండటంతో, వారి వ్యవహారాలను బహిర్గతం చేసేందుకు తనకు పరిమిత సమయం మాత్రమే ఉందంటూ గత వారం ఆమె చెప్పుకొచ్చారు.