పాకిస్థాన్‌కు చెందిన కొందరు హ్యాకర్లు భారత్‌లోని ప్రముఖుల వ్యక్తిగత వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకొని రెచ్చిపోతున్నారు. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కిషన్ రెడ్డి వెబ్‌సైట్ హ్యాక్‌కు గురైంది. ఆయన వ్యక్తిగత వెబ్‌సైట్‌లో పాకిస్థాన్ అనుకూల నినాదాలు పెట్టడంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ హ్యాకర్లు సందేశాలు పెట్టారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని కిషన్ రెడ్డి కార్యాలయం మంగళవారం ధ్రువీకరించింది. హ్యాకింగ్ అనంతరం ఆయన వెబ్‌సైట్ (kishanreddy.com)ఓపెన్ చేస్తే ‘ తాత్కాలికంగా అందుబాటులో లేదు’ అనే సందేశం వస్తోంది. కిషన్‌రెడ్డి వెబ్‌సైట్‌లో ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి సమాచారమూ లేదని అధికారులు తెలిపారు. ఆయన వ్యక్తిగత వివరాలతో పాటు రోజువారీగా ఆయన పాల్గొంటున్న కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉందని స్పష్టంచేశారు. ఈ వెబ్‌సైట్‌లో కిషన్ రెడ్డి వ్యక్తిగతమైన వివరాలతో పాటు ఆయన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు మాత్రమే ఉన్నాయని.. ఇవన్నీ పబ్లిక్ డొమైన్‌లో ఉన్నవేనని చెప్పారు.
కిషన్‌రెడ్డికి పాకిస్థాన్ హ్యాకర్ల దెబ్బ
Related tags :