తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని “పీవీ నరసింహారావు సమాలోచన సభ”
ఆగస్టు 26న మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అధ్యక్షతన తెలంగాణ తేజం- మన పీవి(సాహితీ సౌరభం-అసమాన దార్శనిక) పేరుతో హైదరాబాద్ లో సమాలోచన సభ నిర్వహిస్తున్నారు.
పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలలో భాగంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
రాజ్యసభ సభ్యులు, పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు కే.కేశవరావు, పీవీ తనయుడు ప్రభాకర్ రావు, కూతురు వాణిదేవి, కవి అంపశయ్య నవీన్, రచయిత కల్లూరి భాస్కర్ ఈ సదస్సుకు హాజరుకానున్నారు. దేశానికి, రాష్ట్రానికి పీవీ అందించిన సేవలు, సంస్కరణలు, ఇతర అంశాలను ఈ సభలో చర్చించనున్నారు. ఈ కార్యక్రమాన్ని కింది సామాజిక మాధ్యమాల్లో చూడవచ్చు
Links to social media handles
Facebook : https://www.facebook.com/KavithaKalvakuntla/
Twitter : https://twitter.com/RaoKavitha
Telangana Jagruthi
Facebook : https://www.facebook.com/TelanganaJagruthiOfficial/
Twitter : https://twitter.com/TJagruthi