Agriculture

కౌలు అడిగిన అమరావతి రైతులను జైల్లో పెట్టిన అధికారులు

కౌలు అడిగిన అమరావతి రైతులను జైల్లో పెట్టిన అధికారులు

? రాజధాని అమరావతి రైతులకు పెండింగ్లో ఉన్న కౌలు వెంటనే ఇవ్వాలని కోరుతూ విజయవాడ సి.ఆర్.డి.ఏ కార్యాలయం వద్దకు వచ్చిన రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు.

? అరెస్టు చేసిన మహిళలను సూర్యా రావు పేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి పరామర్శించారు.

? భూములిచ్చిన రైతులకు చట్ట ప్రకారం కౌలు చెల్లించడం ప్రభుత్వ బాధ్యత అని, అడగడానికి వచ్చిన రైతుల పైదౌర్జన్యం చేసి అరెస్టు చేయడం ప్రభుత్వానికి తగదు అని మధు విమర్శించారు.

? రైతులను పరామర్శించిన వారిలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు ఉన్నారు.

##################

కౌలు డబ్బుల కోసం సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చిన అమరావతి రైతులను బలవంతంగా అరెస్ట్ చేయడంపై అమరావతి మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ ఫైర్

రైతులకు మద్దతుగా సీఆర్డీఏ ఆఫీసుకు వచ్చిన సుంకర పద్మశ్రీ, అక్కినేని వనజ జేఏసీ సభ్యులను అరెస్ట్ చేసి సింగ్ నగర్ స్టేషన్ కి తరలించిన పోలీసులు

పోలీసుల తీరుకు వ్యతిరేకంగా భోజనం చేయకుండా స్టేషన్ ఆవరణలోనే నిరసన తెలుపుతున్న జేఏసీ నేతలు

అమరావతి మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ కామెంట్స్

రైతులకు రావాల్సిన కౌలు డబ్బులు ఇవ్వమని అడిగితే మహిళలని కూడా చూడకుండా వారిపై పోలీసులతో దాడి చేయించడం సిగ్గుచేటు

పోలీసుల దాడిలో చాలామంది మహిళ రైతులు గాయపడ్డారు

ముఖ్యమంత్రి జగన్ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా ?

అస్సలు రైతులు చేసిన తప్పేంటి ?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు కొనసాగిస్తున్నారు

ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు

రాజధాని నిర్మాణానికి భూమి ఇవ్వడమేనా రైతులు చేసిన నేరం ?

రైతులకు చెల్లించాల్సిన కౌలు సీఆర్డీఏ కు వచ్చినా ఎందుకని రైతుల ఖాతాల్లో జమ చేయలేకపోతున్నారు ?

రైతుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం