* బుల్లితెర ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు పై నిర్భయ కేసు నమోదు. ఓ NGO సంస్థ సహకారంతో, మిర్యాలగూడ కు చెందిన ఓ 25సంవత్సరాల యువతి పంజగుట్ట పోలీసులను ఆశ్రయించిన ఘటనలో, అనేక మంది ప్రముఖుల పై కేసు నమోదు చేసారు పోలీసులు. తనపై గత కొన్నేళ్ళుగా 139 మంది ఐదువేల సార్లు బలాత్కారం చేసారని సదరు యువతి చేసిన ఫిర్యాదు ఇప్పుడు పోలీసులకు ఓ పెద్ద సవాల్ గా మారింది. యువతి ఇచ్చిన ఫిర్యాదులో యాంకర్ ప్రదిప్ తో పాటు ఓ ప్రముఖ టివి ఛానల్ రిపోర్టర్, సినీ నిర్మాతలు, ప్రముఖ కెమెరా మెన్, ఓ మాజి ఎంపి, ఆయన పీఎ తో పాటు ఓ డాక్టర్ కూడా ఉన్నారు. SFI సంస్థకు చెందిన అనేక మంది విద్యా ర్ధి నాయకుల పై కూడా ఆ యువతి ఫిర్యాదు చేసింది.
* ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్పిటిషన్ దాఖలు చేసిన హైకోర్టు న్యాయవాది ఎం.నాగరఘురాజుపాలెం వైసీపీ కార్యకర్తల తరపున ప్రజా ప్రయోజవ్యాజ్యం దాఖలురాజుపాలెం మండలం కోట నెమలిపురి, కొండమోడులో అక్రమ మైనింగ్ జరిగిందని పిటిషన్కేసు విచారణ వచ్చే నెలకు వాయిదా వేసిన హైకోర్టుకలెక్టర్, మంత్రి పెద్దిరెడ్డి, సీఎం జగన్‍కు పిటిషన్లు పంపినా పట్టించుకోలేదని ఆరోపణఇప్పటికే మైనింగ్ అధికారులు విచారణ జరిపారని పేర్కొన్న పిటిషనర్లువైసీపీ కార్యకర్తలు వేస్తే ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందన్న హైకోర్టుకోర్టుకు పూర్తి వివరాలు చెప్పాల్సిన భాధ్యత తనపై ఉందన్న న్యాయవాది నాగరఘుమంత్రి పెద్దిరెడ్డి విచారణ జరపాలని ఆదేశించినా పట్టించుకోలేదన్న న్యాయవాదిఅక్రమ మైనింగ్‍పై వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఆదేశం
* సింగ్ నగర్ స్టేషన్ లో ఉన్న అమరావతి రైతులను పరామర్శించిన మాజీ మంత్రి దేవినేని ఉమామాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కామెంట్స్రైతులకు రావాల్సిన కవులు డబ్బులు ఇవ్వమని అడిగితే మహిళలని కూడా చూడకుండా వారిపై పోలీసులతో దాడి చేయించారుపోలీసుల దాడిలో చాలామంది మహిళలు గాయపడ్డారుఅస్సలు రైతులు చేసిన తప్పేంటి ?ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు ఇదొక నిదర్శనంమూడు రాజధానుల అంశం హైకోర్టులో ఉండగా మేము జోక్యం చేసుకోలేమంటూ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టురాజధాని నిర్మాణానికి భూమి ఇవ్వడమేనా రైతులు చేసిన నేరంరైతులకు చెల్లించాల్సిన కౌలు సీఆర్డీఏ కు వచ్చినా ఎందుకని రైతుల ఖాతాల్లో జమ చేయలేకపోతున్నారు ?రైతులను ఇబ్బంది పెడుతున్న ముఖ్యమంత్రి తప్పక ఫలితం అనుభవిస్తారు
* గాంధీ ఆస్పత్రి సమీపంలో గర్భిణీ దారుణ హత్యకు గురైంది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను భర్త హతమార్చాడు. గౌతమ్, మహాలక్ష్మి దంపతులు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
* హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లో చిరుత కలకలం సృష్టించింది. స్థానికుల కంటిమీద కునుకులేకుండా చేసిన చిరుత ఆ తర్వాత కనిపించకుండా పోయింది. ఫారెస్ట్ అధికారులు దానిని గుర్తించడానికి, పట్టుకోవడానికి చేయని ప్రయత్నాలు లేవు. చిరుత అక్కడ చూశామంటే.! లేదు ఇక్కడ నుంచే వెళ్లిందిఅని మరికొందరు.. ఇలా.. చిక్కకుండాపోయింది. అయితే, మరోసారి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించింది చిరుత. హిమాయత్‌సాగర్ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యక్షమైంది. పశువుల కొట్టంపై దాడి చేసింది. ఇవాళ తెల్లవారుజామున లేగదూడను చంపేసింది. అక్కడే ఉన్న అహ్మద్ అనే వ్యవసాయదారుడు డప్పు వాయించడంతో చిరుత పారిపోయినట్టు చెబుతున్నారు. మరోవైపు.. ఐదు రోజుల క్రితం పశువుల కొట్టం నుండి పొటేల్‌ను కూడా ఎత్తుకెళ్లినట్టుగా తెలుస్తోంది. కాగా, మే నెలలో బుద్వెల్ వద్ద రోడ్డుపై కనిపించిన చిరుత.. నాలుగు నెలలుగా చిక్కకుండా ముప్పతిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే.
* దేశంలో ఉగ్రదాడులకు ముష్కరులు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఐఎస్‌ఐతో కలిసి జైషే మహ్మద్ సంస్థ పన్నాగం పన్నినట్లు వెల్లడించాయి. జమ్ముకశ్మీర్‌సహా పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ఐఎస్‌ఐ, జైషే సంస్థలు ప్రణాళికలు రచించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ముఫ్తీ రౌఫ్ అజ్ఘర్, షకీల్ అహ్మద్ రావల్పిండిలో ఆగస్టు 20న ఐఎస్‌ఐతో సమావేశం అయ్యారని, ఇందులో రౌఫ్ సోదరుడు మౌలానా అమ్మార్ కూడా పాల్గొన్నట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి.
* ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో. హర్దోయ్ జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 12 మందికి గాయాలయ్యాయి. లక్నో నుంచి 26 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు హర్దోయ్ నుంచి వస్తున్న బస్సును కకోరి వద్ద ఢీకొట్టింది. వ్యాన్ క్రాస్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన 12 మందిని లక్నోలోని ఆసుపత్రుకి తరలించారు. మరణించిన ఆరుగురి మృతదేహాలను పోస్ట్ మార్టం నిర్వహించేందుకు తరలించారు. ఈ ప్రమాదంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.