Editorials

రాజధానిపై కలగజేసుకోబోమని తెలిపిన సుప్రీం

రాజధానిపై కలగజేసుకోబోమని తెలిపిన సుప్రీం

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.  పాలనా వికేంద్రీకరణ,సీఆర్డీఏ రద్దు చట్టాలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ అశోక్‌భూషణ్‌,జస్టిస్‌ ఆర్.సుభాష్‌రెడ్డి,జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. మూడు రాజధానుల వ్యవహారంపై గురువారం హైకోర్టులో విచారణ ఉన్నందున తమ వద్దకు రావడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈకేసును హైకోర్టు త్వరగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే ధర్మాసనం ముందుకు ఆ తర్వాత జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారీమన్‌ ధర్మాసనం ముందుకు రాజధాని పిటిషన్ విచారణకు వచ్చినా… సాంకేతిక కారణాలతో మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. దీంతో ఇవాళ జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ ధర్మాసనం ముందకు పిటిషన్‌ విచారణకు వచ్చింది.