మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె నా..?
★ రాజధాని అంశంపై సుప్రీం కోర్టు తీర్పును యుశ్రారైకాపా నర్సాపురం ఎంపీ, శ్రీ కనుమూరి రఘురామకృష్ణం రాజు స్వాగతించారు.
★ ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన..
★ రైతులు ఆశాభావంతో ఉండాలన్నారు.
★ హైకోర్టులో రైతులే గెలుస్తారని..
★ ధర్మం, న్యాయం గెలుస్తుందని వ్యాఖ్యానించారు.
★ రైతులు ఇంత బాధపడుతుంటే.. కౌలు కోసం రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే.. సీఆర్డీఏ ఆఫీసుకు వెళ్లిన రైతులను అరెస్ట్ చేసి.. దాడి చేయడం దారుణమన్నారు.
★ వారికి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా అడిగితే జైల్లో పెట్టడం ఏంటని ప్రశ్నించారు.
★ ‘‘అమరావతి రైతులకు కౌలు డబ్బు ఇవ్వడం లేదు. మూడు రాజధానులు కడతారా? మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె నా? ఏపీ ప్రజలు ఇదే అంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.