Movies

తమన్నాకు నెగిటివ్. ఆమె తల్లిదండ్రులకు పాజిటివ్.

తమన్నాకు నెగిటివ్. ఆమె తల్లిదండ్రులకు పాజిటివ్.

టాలీవుడ్ న‌టి త‌మ‌న్నా త‌ల్లిదండ్రుల‌కు క‌రోనా సోకింది. త‌మ‌న్నా త‌ల్లిదండ్రుల‌కు స్వ‌ల్పంగా అనుమానిత ల‌క్ష‌ణాలుండ‌టంతో వారికి కోవిడ్‌-19 ప‌రీక్ష‌లు చేయించింది. అంతేకాకుండా త‌న‌తోపాటు సిబ్బందికి కూడా ప‌రీక్ష‌లు చేయించింది. త‌ల్లిదండ్రుల‌కు పాజిటివ్ గా తేల‌గా..త‌మ‌న్నాతోపాటు మిగిలిన సిబ్బందికి నెగెటివ్ వ‌చ్చింది. కోవిడ్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ముందు జాగ్ర‌త్త‌గా అమ్మానాన్నకు ప‌రీక్ష‌లు చేయించాను. దుర‌దృష్ట‌వ‌శాత్తు వారికి పాజిటివ్ వ‌చ్చింద‌ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లో త‌మ‌న్నా పేర్కొంది. వెంట‌నే అధికారుల‌కు మా ప‌రిస్థితుల‌ను వివ‌రించాను. డాక్ట‌ర్లు, అధికారుల సాయంతో చికిత్స కొన‌సాగిస్తున్నాం. నాతోపాటు సిబ్బంది అంద‌రికీ నెగెటివ వ‌చ్చింది. మీ అంద‌రి ప్రార్థ‌న‌లు, ఆ దేవుడి ద‌య వ‌ల్ల అమ్మానాన్న త్వ‌ర‌గా కోలుకుంటున్నార‌ని ఆశిస్తున్నాన‌ని పోస్ట్ లో పేర్కొంది.