ఏపీలో మద్యం తాగితే రెండుమూడేళ్లలో చనిపోయే ప్రమాదం..!
ఆంధ్రప్రదేశ్‌లో తయారయ్యే మద్యం తాగితే రెండుమూడేళ్లలోనే చనిపోయే ప్రమాదం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత, ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన..
దేశంలో ఎక్కడలేని విచిత్రమైన మద్యం బ్రాండ్లు అమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. ఒకే కంపెనీలో తయారవుతున్న వివిధ మద్యం బ్రాండ్లు ప్రజల ఆరోగ్యానికి చేటు చేసే అవకాశం ఉందన్న ఆయన.. ఏపీలో తయారయ్యే మద్యం తీసుకుంటే రెండుమూడేళ్లలోనే చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మద్యనిషేధం పేరుతో ఎక్కడాలేని బ్రాండ్లను తీసుకొచ్చి అమ్మడం సరికాదని హితవు పలికిన రఘురామకృష్ణంరాజు…
పేరు, ఊరులేని బ్రాండ్లను తాగడం మానేయండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. మాయదారి బ్రాండ్ల గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తెలియదన్నారు వైసీపీ రెబల్ ఎంపీ..
అసలు, దేశంలో ఎక్కడాలేని బ్రాండ్లు రాష్ట్రంలో ఎలా లభ్యం అవుతున్నాయి అని ప్రశ్నించారు…
బ్రాండ్ల విషయంలో విచారణ జరిపించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.