వారసత్వంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన వారంతా చెడ్డవారేనని అనుకోవద్దని అంటోంది బాలీవుడ్ కథానాయిక స్వరాభాస్కర్. వారసుల్లో అంకితభావంతో పనిచేసే చక్కటి వ్యక్తిత్వమున్నవారున్నారని చెబుతోంది. సుశాంత్‌సింగ్‌రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో ఇన్‌సైడర్స్, ఔట్‌సైడర్స్ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రతిభావంతులైన నటులకు అవకాశాలు లేకుండా చేస్తున్నారంటూ వారసులపై పలువురు ప్రముఖులు విమర్శల్ని సంధిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్వరాభాస్కర్ మాట్లాడుతూ ‘చిత్రసీమలో వారసత్వంతో అడుగుపెట్టే వారికి చాలా సౌలభ్యాలుండే మాట వాస్తవమే. అవకాశాలు, పేరుప్రఖ్యాతులు సులభంగా సంపాదించుకోవచ్చు. కేవలం వారసత్వంతోనే వారు నిలదొక్కుకోలేరు. వారసులతో పోలిస్తే స్వీయప్రతిభతో ఎదుగుతున్న వారిపట్ల సినీ పరిశ్రమలో గౌరవం, విశ్వసనీయత ఎక్కువగా కనిపిస్తాయి. ప్రతిభావంతులైన నటుల్ని ఎదగనీయకుండా వారి కెరీర్‌ను పతనం చేసేందుకు వారసులు కుట్రలు పన్నుతుంటారని అనుకోవడం సరికాదు. పెద్ద విజయాలు, స్టార్‌ఇమేజ్ రాగానే తప్పుడు మార్గాల్లో నడుస్తూ ఇతరుల పట్ల అమర్యాదపూర్వకంగా ప్రవర్తించే ఔట్‌సైడర్స్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అధికార దుర్వినియోగానికి పుట్టుకతో ఎలాంటి సంబంధం ఉండదు’ అని తెలిపింది.
వారసులు అందరూ వేస్ట్ కాదు
Related tags :